నాస్తికోద్యమ నేత లవణం కన్నుమూత
ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ నాస్తికోద్యమ నేత లవణం (86) కన్ను మూశారు. నెల రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్ను మూశారని ఆయన సోదరుడు విజయం తెలిపారు. పది సంవత్సరాల క్రితం ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. ఆయనకు మూడు రోజుల నుంచి ఊపిరి పీల్చడం కూడా కష్టమైంది. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశారు. నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సర్వసతి గోరా దంపతుల తొమ్మిది […]
BY sarvi14 Aug 2015 6:00 AM IST
X
sarvi Updated On: 14 Aug 2015 11:22 AM IST
ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ నాస్తికోద్యమ నేత లవణం (86) కన్ను మూశారు. నెల రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్ను మూశారని ఆయన సోదరుడు విజయం తెలిపారు. పది సంవత్సరాల క్రితం ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. ఆయనకు మూడు రోజుల నుంచి ఊపిరి పీల్చడం కూడా కష్టమైంది. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశారు. నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సర్వసతి గోరా దంపతుల తొమ్మిది మంది సంతానంలో లవణం రెండవ వారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ సమయంలో జన్మించడంతో గోరా ఈయనకు లవణం అని పేరు పెట్టారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం ఈయన సోదరులు. నవయుగ కవి చక్రవర్తి గుర్రంజాషువా కుమార్తె హేమలత.. లవణం జీవన సహచరి. ఏడో తరగతి దాకానే చదువుకున్న లవణం.. తన తండ్రితో పాటు మహాత్మాగాంధీ, వినోబా భావేల ప్రభావం తనపై ఎక్కువని చెప్పేవారు. నాస్తికుడంటూ తనను ఎందరు ద్వేషించినా, ముఖంపైనే తిట్టినా వారితో వాదనకు దిగకుండా సరదాగా మాట్లాడేవారు. అలాంటి వ్యక్తిత్వం ఆయనది. స్వతహాగా హాస్యప్రియుడు. చిన్నతనంలో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న లవణం.. 1973లో విజయవాడ హేతువాద సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అస్పృశ్యత నివారణకు, కులనిర్మూలనకు కృషి చేశారు. హేతువాదం, నాస్తికత్వంపై పలు పుస్తకాలు రచించారు.
Next Story