Telugu Global
Others

రూ. 145 కోట్లతో కర్నూలులో కాన్సర్‌ ఆస్పత్రి: కామినేని

పోలవరం పూర్తయితే రాయలసీమకు నీటి కష్టాలు తీరుతాయని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రూ.145 కోట్లతో కర్నూలులో క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. నెల్లూరులో మరో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామని వివరించారు. కొన్ని చోట్ల ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనీ, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎయిమ్స్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నదుల అనుసంధానం వాజ్ పేయి కల అని, త్వరలోనే అది నెరవేరుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం […]

పోలవరం పూర్తయితే రాయలసీమకు నీటి కష్టాలు తీరుతాయని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రూ.145 కోట్లతో కర్నూలులో క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. నెల్లూరులో మరో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామని వివరించారు. కొన్ని చోట్ల ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనీ, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎయిమ్స్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నదుల అనుసంధానం వాజ్ పేయి కల అని, త్వరలోనే అది నెరవేరుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

First Published:  13 Aug 2015 1:20 PM GMT
Next Story