జర నవ్వండి ప్లీజ్ 174
మెరుగు “మేస్టారూ! మా అబ్బాయి లెక్కల్లో ఏమైనా మెరుగయ్యాడా?” “ఆ… ఇదివరకటి మీద కాస్త బెటర్. మొన్న తొమ్మిది తొమ్మిదులు ఎంత అని అడిగితే 40 అన్నాడు. ఈ రోజు 75 అంటున్నాడు మరి!!!”. —————————————————————- అందం “సినిమాలో విలన్లందరూ అందంగా ఎందుకుంటారే?” “హీరోయిన్ సగం సినిమా విలన్‌తోనే కదా కలిసి చేయాల్సింది. మరి అతను అందంగా లేకుంటే ఎలా?” —————————————————————- మందు డాక్టర్:”మీ మతిమరుపుకు ఇచ్చిన మందు బాగానే పని చేస్తోందా?” పేషెంట్: “కాస్త డోస్ […]
మెరుగు
“మేస్టారూ! మా అబ్బాయి లెక్కల్లో ఏమైనా మెరుగయ్యాడా?”
“ఆ… ఇదివరకటి మీద కాస్త బెటర్. మొన్న తొమ్మిది తొమ్మిదులు ఎంత అని అడిగితే 40 అన్నాడు. ఈ రోజు 75 అంటున్నాడు మరి!!!”.
—————————————————————-
అందం
“సినిమాలో విలన్లందరూ అందంగా ఎందుకుంటారే?”
“హీరోయిన్ సగం సినిమా విలన్‌తోనే కదా కలిసి చేయాల్సింది. మరి అతను అందంగా లేకుంటే ఎలా?”
—————————————————————-
మందు
డాక్టర్:”మీ మతిమరుపుకు ఇచ్చిన మందు బాగానే పని చేస్తోందా?”
పేషెంట్: “కాస్త డోస్ ఎక్కువయ్యిందండి. నాకు గత జన్మ కూడా గుర్తుకు వచ్చేస్తోంది!”
—————————————————————-
ఏం ఇస్తారు?
“ఏమండీ! వంటమనిషిని పనిలోనుంచి తీసేసి మొత్తం వంటంతా నేనే చేసేననుకోండి నాకేం ఇస్తారు?” అడిగింది సుధ.
“ఇంక నేనేమీ ఇవ్వక్కర్లేదు. మర్నాడు లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్లు వచ్చి నా పాలసీ డబ్బంతా నీ చేతిలో పెట్టేస్తారు” చెప్పాడు సత్యారావు.