Telugu Global
Others

స్టార్‌ హోటళ్లలో మంత్రుల బసపై నిషేధం

విజయవాడ నుంచి పరిపాలన సాగిస్తామని చెబుతున్న మంత్రులకు చేదు వార్త. స్టార్‌ హోటళ్ళలో ఉంటూ పాలన సాగించడం ఇక సాధ్యం కాదు. ఎందుకంటే స్టార్‌ హోటళ్లలో మంత్రుల బసపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ప్రభుత్వ అతిధి గృహాల్లో మాత్రమే మంత్రులు నివాసం ఉండాలని కోరారు. ప్రభుత్వ అతిధి గృహాలకు మరమ్మతులు చేయాలని ఆర్‌ అండ్‌ బి అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారుల నివాసాల కోసం అద్దె రేట్లను కూడా సవరిస్తున్నట్టు ఆయన […]

స్టార్‌ హోటళ్లలో మంత్రుల బసపై నిషేధం
X
విజయవాడ నుంచి పరిపాలన సాగిస్తామని చెబుతున్న మంత్రులకు చేదు వార్త. స్టార్‌ హోటళ్ళలో ఉంటూ పాలన సాగించడం ఇక సాధ్యం కాదు. ఎందుకంటే స్టార్‌ హోటళ్లలో మంత్రుల బసపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ప్రభుత్వ అతిధి గృహాల్లో మాత్రమే మంత్రులు నివాసం ఉండాలని కోరారు. ప్రభుత్వ అతిధి గృహాలకు మరమ్మతులు చేయాలని ఆర్‌ అండ్‌ బి అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారుల నివాసాల కోసం అద్దె రేట్లను కూడా సవరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. రెండు నెలల్లో ఉద్యోగులు విజయవాడకు తరలిరావాల్సి ఉన్నందున వారి నివాస, కార్యాలయ, వసతుల ఏర్పాట్లను జవహర్‌ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. టూరిజం పార్కు, సబ్‌ కలెక్టరు సమావేశ మందిరాలను మంత్రులు, అధికారులు సమీక్షలకు వినియోగించుకోవాలని మంత్రి యనమల కోరారు. ఉద్యోగుల కోసం పదివేల ఇళ్లను నిర్మించేందుకు హడ్కో ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు.
First Published:  14 Aug 2015 10:23 AM IST
Next Story