గాంధీ ఆస్పత్రిలో కాలంచెల్లిన మందుల సరఫరా
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను రోగులకు ఇస్తున్నారని హెచ్ఆర్సీ చైర్మన్ కక్రూ ఆరోపించారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రిని హెచ్‌ఆర్సీ బృందం పరీశీలించింది. ఈసందర్భంగా కక్రూ మాట్లాడుతూ వార్డుల్లో పారిశుభ్రత లోపించిందని మండిపడ్డారు. ఎక్కడబడితే అక్కడ చెత్త పేరుకుపోయిందని, పరిశుభ్రతపై ఆస్పత్రివర్గాలు దృష్టి పెడుతున్నట్టు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించామని తెలిపారు. ఆసుపత్రిలో మందుల కొరతపై నార్త్‌జోన్ డీసీపీ ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరిపిస్తామని తెలియజేశారు.
BY sarvi13 Aug 2015 6:47 PM IST
sarvi Updated On: 14 Aug 2015 10:44 AM IST

Next Story