పింఛన్లో అసమానతలపై మాజీ సైనికుల నిరసన
మాజీ సైనికులు ఆందోళన బాటపట్టారు. ఒకే హోదా.. ఒకే పెన్షన్.. తక్షణం అమలు చేయాలని కోరుతూ… ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. ప్రస్తుతం ఒకే హోదా కలిగిన వారికి ఒకే రకమైన పెన్షన్ అందడం లేదని, ఒక్కోసారి సీనియర్ల కంటే జూనియర్లకే ఎక్కువ వస్తోందని మాజీ సైనికులు ఆరోపిస్తున్నారు. దేశం కోసం అహర్నిశలు కష్టపడిన సైనికుల కోసం… ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరసనకారులకు […]
మాజీ సైనికులు ఆందోళన బాటపట్టారు. ఒకే హోదా.. ఒకే పెన్షన్.. తక్షణం అమలు చేయాలని కోరుతూ… ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. ప్రస్తుతం ఒకే హోదా కలిగిన వారికి ఒకే రకమైన పెన్షన్ అందడం లేదని, ఒక్కోసారి సీనియర్ల కంటే జూనియర్లకే ఎక్కువ వస్తోందని మాజీ సైనికులు ఆరోపిస్తున్నారు. దేశం కోసం అహర్నిశలు కష్టపడిన సైనికుల కోసం… ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరసనకారులకు సంఘీభావం తెలిపారు. మొత్తానికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తన ప్రసంగంలో సైనికుల కోసం ‘వన్ ర్యాంక్… వన్ పెన్షన్…’ అంశంపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.