ఏపీ గ్రామాలను స్మార్ట్‌గా మారుద్దాం: సీఎం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గ్రామాన్నీ స్మార్ట్ గా మారుద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలోని మూడు గ్రామాలను జపాన్ కంపెనీ మిత్సుబిషి, వ్యవసాయ రంగ పరిశోధకులు స్వామినాథన్ పౌండేషన్లు స్మార్ట్ విలేజ్‌లో భాగంగా దత్తత తీసుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ హాల్లో గ్రామల దత్తత స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణాల్లోని సౌకర్యాలను పల్లెటూర్లలో కూడా కల్పిస్తే వలసలు తగ్గుతాయని, రాష్ట్రంలోని గ్రామాలను స్మార్ట్ […]
BY sarvi13 Aug 2015 6:44 PM IST
X
sarvi Updated On: 14 Aug 2015 8:11 AM IST
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గ్రామాన్నీ స్మార్ట్ గా మారుద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలోని మూడు గ్రామాలను జపాన్ కంపెనీ మిత్సుబిషి, వ్యవసాయ రంగ పరిశోధకులు స్వామినాథన్ పౌండేషన్లు స్మార్ట్ విలేజ్‌లో భాగంగా దత్తత తీసుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ హాల్లో గ్రామల దత్తత స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణాల్లోని సౌకర్యాలను పల్లెటూర్లలో కూడా కల్పిస్తే వలసలు తగ్గుతాయని, రాష్ట్రంలోని గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా మార్చేందుకు కోడ్ ఫర్ ఏపీని ప్రారంభించామని ఆయన చెప్పారు. ప్రజలు ఇంగ్లీష్‌తోపాటు జపాన్ భాషనూ నేర్చుకోవాలని సూచించారు.
Next Story