ఓటుకు కోట్లు వ్యవహారంలో మరో సంచలనం...
టేపులు నిజమైనవేనని కోర్టుకు ఫోరెన్సిక్ నివేదిక ఓటుకు కోట్లు వ్యవహారానికి సంబంధించి ఆడియో, వీడియో టేపుల్లో ఉన్న సంభాషణలు అసలైనవేనని మరింత స్పష్టంగా తేలిపోయింది. ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్ ) నివేదిక ఈవిషయాన్ని స్పష్టం చేస్తోంది. వీడియోలోని వ్యక్తుల మధ్య సాగిన సంభాషణల్లో కత్తిరింపులు, అతికించడాలు ఏవీ లేవని ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. పెదవుల కదలికల్లో కూడా ఎలాంటి తేడాల్లేవని అది తేల్చింది. పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఎఫ్ఎస్ఎల్ ఎసిబి ప్రత్యేక కోర్టుకు సమర్పిం చింది. […]
BY Pragnadhar Reddy14 Aug 2015 3:11 AM IST
X
Pragnadhar Reddy Updated On: 14 Aug 2015 3:12 AM IST
టేపులు నిజమైనవేనని కోర్టుకు ఫోరెన్సిక్ నివేదిక
ఓటుకు కోట్లు వ్యవహారానికి సంబంధించి ఆడియో, వీడియో టేపుల్లో ఉన్న సంభాషణలు అసలైనవేనని మరింత స్పష్టంగా తేలిపోయింది. ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్ ) నివేదిక ఈవిషయాన్ని స్పష్టం చేస్తోంది. వీడియోలోని వ్యక్తుల మధ్య సాగిన సంభాషణల్లో కత్తిరింపులు, అతికించడాలు ఏవీ లేవని ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. పెదవుల కదలికల్లో కూడా ఎలాంటి తేడాల్లేవని అది తేల్చింది. పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఎఫ్ఎస్ఎల్ ఎసిబి ప్రత్యేక కోర్టుకు సమర్పిం చింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటు వేసేందుకు, టిఆర్‌ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రూ. 50 లక్షలు చెల్లిస్తూ టిడిపి ఎమ్మెల్యే ఎ రేవంత్ రెడ్డి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ సంభాషణల ఫుటేజీలను ఎసిబి సిబ్బంది ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. వీటిలో రెండు సెల్ ఫోన్లు, కెమెరాలు, రేవంత్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ సిపియు సహా 14 ఆడియో, వీడియో టేపులు ఉన్నాయి. 12 రోజుల పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ సిబ్బంది వాటిని పరిశీలించి, అవన్నీ అసలైనవేనని నిర్ధారించారు. దీంతో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ తదితరులు మాట్లాడిన సంభాషణలు వాస్తవమేనని తేలిపోయింది. మొత్తం మూడు ఫైల్స్‌లో మొదటి వీడియో నిడివి 86 నిమిషాల 21 సెకన్లు, రెండో వీడియో నిడివి 10 నిమిషాల 38 సెకన్లు, మూడో వీడియో నిడివి 43 నిమిషాల 9 సెకన్లు ఉన్నట్లు తెలిసింది. తొలి ఆడియో ఫైల్ నిడివి 45 నిమిషాల 12 సెకన్లు, రెండో ఫైల్ 44 నిమిషాల 52 సెకన్లు, మూడో ఫైల్ 47 నిమిషాల 18 సెకన్లు ఉన్నట్లు తెలిసింది. ఇపుడు ఇక ఈ వ్యవహారంలో తదుపరి చర్యలు ఏమిటన్నవి న్యాయస్థానం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరి విచారణ కోసం నోటీసులు జారీ చేస్తుందా లేక ఏకంగా అరెస్టు వారెంట్లు జారీ అవుతాయా చూడాల్సి ఉంది.
Next Story