Telugu Global
Cinema & Entertainment

వరుణ్ తేజ్ `కంచె`  టీజ‌ర్ కు  డేట్ ఫిక్స్...!

సామాజిక  , వాస్త‌విక అంశాల‌తో  చిత్రాలు చేసే ద‌ర్శ‌కుడు   క్రిష్.  వేదం,  కృష్ణమ్ వందే జ‌గ‌ద్దురుమ్ వంటి సినిమాల‌తో  త‌న అభిరుచిని చాటుకున్న ఈ యువ ద‌ర్శ‌కుడు  ….తాజాగా    మెగావారి అబ్బాయి  వ‌రుణ్ తేజ్  హీరోగా   కంచె సినిమాను చేస్తున్న విష‌యం తెలిసిందే.  ముకుంద చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మైన వ‌రుణ్ తేజ్ కు ఈ చిత్రం  సెకండ్ ఫిల్మ్.   కంచె సినిమా  క్రిష్ త‌ర‌హా  సామాజిక అంశాల‌తో పాటు.. యూత్ ను ఆకట్టుకునే   ప్రేమ […]

వరుణ్ తేజ్ `కంచె`  టీజ‌ర్ కు  డేట్ ఫిక్స్...!
X

సామాజిక , వాస్త‌విక అంశాల‌తో చిత్రాలు చేసే ద‌ర్శ‌కుడు క్రిష్. వేదం, కృష్ణమ్ వందే జ‌గ‌ద్దురుమ్ వంటి సినిమాల‌తో త‌న అభిరుచిని చాటుకున్న ఈ యువ ద‌ర్శ‌కుడు ….తాజాగా మెగావారి అబ్బాయి వ‌రుణ్ తేజ్ హీరోగా కంచె సినిమాను చేస్తున్న విష‌యం తెలిసిందే. ముకుంద చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మైన వ‌రుణ్ తేజ్ కు ఈ చిత్రం సెకండ్ ఫిల్మ్. కంచె సినిమా క్రిష్ త‌ర‌హా సామాజిక అంశాల‌తో పాటు.. యూత్ ను ఆకట్టుకునే ప్రేమ వంటి అంశాలతో చేసిన‌ట్లు తెలుస్తుంది.
ఇక ఈ చిత్రం ప్ర‌చారంలో మొద‌టి ఘ‌ట్ట‌మైన టీజ‌ర్ ఓపెనింగ్ కు మూహుర్తం ఖ‌రారు చేశారు. ఆగ‌ష్టు 15న ఈ చిత్రం టీజ‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్లు వ‌రుణ్ తేజ్ త‌న అఫిషియ‌ల్ సోష‌ల్ నెట్ వ‌ర్క్ సైట్ లో తెలిపారు.
ఇక సినిమా కంచె సినిమా ర‌షేష్ చూసి నాగ‌బాబు షాక్ అయిన‌ట్లు మెగా స‌న్నిహితులునుంచి టాక్ వినిపిస్తుంది. ఇది పిరియాడిక్ డ్రామ్ గా చేస్తున్నారు. ఇండిపెండెన్స్ కు ముందు జ‌రిగిన ప్రేమ క‌థ గా చేస్తున్నారు. మిర్చిలాంటి కుర్రాడు చిత్రంలో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన ప్ర‌జ్ఞ జైస్వాల్ వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న హీరోయిన్ గా చేస్తుంది.

First Published:  13 Aug 2015 12:31 AM IST
Next Story