భటుడిగా మారిన సునిల్
కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా సెటిల్ అవ్వడానికి శతవిధాల పోరాడుతున్న సునీల్ కి భీమవరం బుల్లోడు చిత్రం ఒక మాదిరి సక్సెస్ మాత్రమే ఇచ్చింది. అది తనకు పూలరంగడంటతటి సక్సెస్ కాదు. చేసిన ప్రతి చిత్రం నుంచి హండ్రెట్ పర్సెంట్ సునిల్ మార్క్ పంచ్ కామెడి ఆడియన్స్ ఎక్సె పెక్ట్ చేస్తుంటారు. అయితే సునిల్ తన ప్రతి చిత్రంలో ఆడియన్స్ అంచనాల మేరకు అవుట్ పుట్ అందించిలేక పోతు సతమతవుతున్న విషయం తెలిసిందే. […]
BY admin13 Aug 2015 12:33 AM IST
X
admin Updated On: 13 Aug 2015 7:14 AM IST
కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా సెటిల్ అవ్వడానికి శతవిధాల పోరాడుతున్న సునీల్ కి భీమవరం బుల్లోడు చిత్రం ఒక మాదిరి సక్సెస్ మాత్రమే ఇచ్చింది. అది తనకు పూలరంగడంటతటి సక్సెస్ కాదు. చేసిన ప్రతి చిత్రం నుంచి హండ్రెట్ పర్సెంట్ సునిల్ మార్క్ పంచ్ కామెడి ఆడియన్స్ ఎక్సె పెక్ట్ చేస్తుంటారు. అయితే సునిల్ తన ప్రతి చిత్రంలో ఆడియన్స్ అంచనాల మేరకు అవుట్ పుట్ అందించిలేక పోతు సతమతవుతున్న విషయం తెలిసిందే.
దీంతో ఒక దశలో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది సునీల్ కెరీర్. అయితే ప్రస్తుత్తానికి అది తాత్కలికమే అంటా. ఇప్పుడు డైరెక్టర్ వంశీ కృష్ణ ఆకేళ్ల తో ఒక చిత్రం చేయడానికి అన్ని సెట్ అయినట్లు టాక్. ఈ చిత్రానికి ‘భటుడు’ అని నామకరణం చేసినట్లు సమాచారం. ఆర్.పి క్రియేషన్స్ బ్యానర్ లో ఆర్ సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునిల్ సురసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సిస్టర్ మునార్ చోప్రా నటిస్తుందట. యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను చేస్తున్నట్లు టాక్. మరి ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలు చేయడానికి సిద్దమైన సునిల్ ఈ యేడాది ఒక బిగ్ హిట్ కొట్టక పోతే హీరోగా కంటిన్యూ కావడం కస్టమే మరి.!
Next Story