తిరుమలలో నిలిచిన లడ్డూ ప్రసాదం జారీ
తిరుమల శ్రీవారి కొండపై లడ్డూ ప్రసాదం జారీ ప్రక్రియ నిలిచిపోయింది. సర్వర్‌లో సాంకేతిక లోపం కారణంగా బార్ కోడింగ్ విధానం పని చేయడం లేదు. ఈ కారణంగా క్యూలైన్లలో ఉన్న లడ్డూ టికెట్ల కౌంటర్‌లో కూపన్ల జారీని నిలిపివేశారు. దీంతో ప్రసాదం అందక శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంకన్న దర్శనం అనంతరం మళ్లీ ప్రసాదం టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఉండాల్సి వస్తుంది. సమస్యను పరిష్కరించే విషయంలో టీటీడీ అధికారులు […]
BY sarvi12 Aug 2015 6:41 PM IST
X
sarvi Updated On: 13 Aug 2015 7:58 AM IST
తిరుమల శ్రీవారి కొండపై లడ్డూ ప్రసాదం జారీ ప్రక్రియ నిలిచిపోయింది. సర్వర్‌లో సాంకేతిక లోపం కారణంగా బార్ కోడింగ్ విధానం పని చేయడం లేదు. ఈ కారణంగా క్యూలైన్లలో ఉన్న లడ్డూ టికెట్ల కౌంటర్‌లో కూపన్ల జారీని నిలిపివేశారు. దీంతో ప్రసాదం అందక శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంకన్న దర్శనం అనంతరం మళ్లీ ప్రసాదం టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఉండాల్సి వస్తుంది. సమస్యను పరిష్కరించే విషయంలో టీటీడీ అధికారులు చొరవ చూపించడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story