కొత్తగా ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం: కేంద్రమంత్రి
కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు. ఆయన బుధవారం ఢిల్లీలోని రైల్‌భవన్ నుంచి ఈ కొత్త రైలును ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన ఏసీ సౌకర్యమున్న ఈ ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖపట్నం నుంచి తెలంగాణ మీదగా ఢిల్లీ వెళుతుంది. కాగా ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీల మధ్య నడుస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చామని సురేష్ ప్రభు వెల్లడించారు. ఈ […]
BY sarvi13 Aug 2015 10:06 AM IST
X
sarvi Updated On: 13 Aug 2015 10:26 AM IST
కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు. ఆయన బుధవారం ఢిల్లీలోని రైల్‌భవన్ నుంచి ఈ కొత్త రైలును ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన ఏసీ సౌకర్యమున్న ఈ ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖపట్నం నుంచి తెలంగాణ మీదగా ఢిల్లీ వెళుతుంది. కాగా ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీల మధ్య నడుస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చామని సురేష్ ప్రభు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చినప్పటికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల నవంబరు 15 వరకు ఎపీ ఎక్స్‌ప్రెస్ పేరుతోనే నడుస్తుందని, ప్రయాణీకులు మూడు నెలల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల ఆ పరిస్థితి తలెత్తిందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే రైలు పేరు మార్చామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు పాల్గొన్నారు.
Next Story