ముగిసిన పార్లమెంట్ సమావేశాలు
ముఖ్యమైన ఒక్క బిల్లు కూడా ఆమోదం పొందకుండానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిపోయాయి. సమావేశాలు మొదలైనప్పటి నుంచి చివరి రోజు వరకు లలిత్‌మోడీ, వ్యాపమ్ స్కామ్‌లపై విపక్షాలు తమ ఆందోళనలను కొనసాగించాయి. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వసుంధరరాజే, శివరాజ్‌సంఘ్ చౌహాన్‌ల రాజీనామాలపై చివరిరోజు వరకు విపక్షాలు తమ పట్టును వీడలేదు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన తెలిపాయి. విపక్షాల ఆందోళన మధ్యే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దీంతో […]
BY sarvi13 Aug 2015 10:32 AM IST
X
sarvi Updated On: 13 Aug 2015 10:32 AM IST
ముఖ్యమైన ఒక్క బిల్లు కూడా ఆమోదం పొందకుండానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిపోయాయి. సమావేశాలు మొదలైనప్పటి నుంచి చివరి రోజు వరకు లలిత్‌మోడీ, వ్యాపమ్ స్కామ్‌లపై విపక్షాలు తమ ఆందోళనలను కొనసాగించాయి. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వసుంధరరాజే, శివరాజ్‌సంఘ్ చౌహాన్‌ల రాజీనామాలపై చివరిరోజు వరకు విపక్షాలు తమ పట్టును వీడలేదు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన తెలిపాయి. విపక్షాల ఆందోళన మధ్యే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దీంతో లోక్‌సభ నుంచి కాంగ్రెస్ సహా తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, ఎస్పీ, వామపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రశ్నోత్తరాల అనంతరం లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ముగిసనట్టు, సభ నిరవధికంగా వాయిదా పడినట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. జాతీయగీతాలాపన అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. చివరిరోజు సభ మొదలవగానే లలిత్‌గేట్‌పై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో చైర్మన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.
Next Story