శ్రీమంతుడి చుట్టూ రాజకీయాలు..
మహేష్-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు చూశారు. ఈ సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా శ్రీమంతుడ్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అందరికంటే ముందు వెంకయ్య, తనకు శ్రీమంతుడు బాగా నచ్చిందన్నారు. అసలు సినిమాలో కొన్ని సీన్లు చూస్తుంటే.. తనను చూసే ఈ సినిమా తీశారేమో అనిపించిందన్నారు వెంకయ్య. ఈ కాలంలో ఇలాంటి సినిమా రావడం నిజంగా గొప్పవిషయం అన్న వెంకయ్య, సినిమా చూస్తున్నంతసేపు తన బాల్యంలోకి వెళ్లిపోయానని అప్పటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. […]
BY admin13 Aug 2015 12:34 AM IST
X
admin Updated On: 13 Aug 2015 9:36 AM IST
మహేష్-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు చూశారు. ఈ సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా శ్రీమంతుడ్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అందరికంటే ముందు వెంకయ్య, తనకు శ్రీమంతుడు బాగా నచ్చిందన్నారు. అసలు సినిమాలో కొన్ని సీన్లు చూస్తుంటే.. తనను చూసే ఈ సినిమా తీశారేమో అనిపించిందన్నారు వెంకయ్య. ఈ కాలంలో ఇలాంటి సినిమా రావడం నిజంగా గొప్పవిషయం అన్న వెంకయ్య, సినిమా చూస్తున్నంతసేపు తన బాల్యంలోకి వెళ్లిపోయానని అప్పటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా శ్రీమంతుడ్ని ఆకాశానికెత్తేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీమంతుడికి లింక్ పెడుతూ ట్వీట్ చేశారు కేటీఆర్. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్న ఈ సమయంలో శ్రీమంతుడు సినిమా రావడం చాలా ఆనందంగా ఉందంటూనే, మహేష్ ను ప్రత్యేకంగా అభినందించారు కేటీఆర్. మొత్తానికి శ్రీమంతుడు సినిమా రాజకీయ నాయకుల్ని కూడా ఎట్రాక్ట్ చేసింది.
Next Story