Telugu Global
Others

కోన శంక‌రాభ‌ర‌ణంలో న‌టిస్తున్న‌ లాలూ యాద‌వ్‌?

టాలీవుడ్‌లో ఇది సెన్సేష‌న‌ల్‌ న్యూస్‌!ఎందుకంటే బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తెలుగు సినిమాలో న‌టిస్తున్నారుట‌. అదీ బీహార్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో! కోన వెంక‌ట్ నిర్మిస్తున్న శంక‌రాభ‌ర‌ణం చిత్రంలో న‌టించ‌డానికి లాలూ యాద‌వ్ అంగీక‌రించార‌ని తెలుస్తోంది. బీహార్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మిస్తున్న చిత్రం కావ‌డంతో న‌టించ‌డానికి లాలూ అంగీక‌రించార‌ని కోన క్యాంప్ నుంచి అందుతున్న స‌మాచారం! వెండితెర‌పై తొలిసారి: లాలూని పోలిన పాత్ర‌లో చాలామంది తెర‌పై న‌టించారు. కానీ లాలూ మాత్రం ఇంత‌వ‌ర‌కూ న‌టించ‌లేదు. బాలీవుడ్‌కి కూడా ఆ […]

కోన శంక‌రాభ‌ర‌ణంలో న‌టిస్తున్న‌ లాలూ యాద‌వ్‌?
X

టాలీవుడ్‌లో ఇది సెన్సేష‌న‌ల్‌ న్యూస్‌!ఎందుకంటే బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తెలుగు సినిమాలో న‌టిస్తున్నారుట‌. అదీ బీహార్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో! కోన వెంక‌ట్ నిర్మిస్తున్న శంక‌రాభ‌ర‌ణం చిత్రంలో న‌టించ‌డానికి లాలూ యాద‌వ్ అంగీక‌రించార‌ని తెలుస్తోంది. బీహార్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మిస్తున్న చిత్రం కావ‌డంతో న‌టించ‌డానికి లాలూ అంగీక‌రించార‌ని కోన క్యాంప్ నుంచి అందుతున్న స‌మాచారం!

వెండితెర‌పై తొలిసారి:
లాలూని పోలిన పాత్ర‌లో చాలామంది తెర‌పై న‌టించారు. కానీ లాలూ మాత్రం ఇంత‌వ‌ర‌కూ న‌టించ‌లేదు. బాలీవుడ్‌కి కూడా ఆ అదృష్టం ద‌క్క‌లేదు. కానీ ఆయ‌న తొలిసారి నేరుగా తెలుగు సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించారని కోన స‌న్నిహితులు చెబుతున్నారు. త‌న శంక‌రాభ‌ర‌ణానికి లాలూ అపియ‌రెన్స్ గొప్ప ఎసెట్ అవుతుంద‌ని కోన పొంగిపోతున్నాడుట‌! మరి వెండితెర‌పై లాలూ ఎలా అద‌ర‌గొడ‌తాడో చూడాలి!

First Published:  13 Aug 2015 1:03 AM
Next Story