Telugu Global
Others

రూ. 5 కోట్ల విలువైన పసిడి ఖురాన్‌!

హైదరాబాద్‌లో దొరికినట్టు చెబుతున్న ఓ 500 యేళ్ళనాటి ఖురాన్‌ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న దుండగులను మైసూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఖురాన్‌ బంగారు లేపనంతో ఉంది. నిందితులంతా కర్ణాటకలోని రాయచూరు, సింధనూరు, గుల్బర్గా, ఉడిపి, షిమోగ జిల్లాలకు చెందినవారుగా గుర్తించినట్టు మైసూరు జిల్లా ఎస్పీ అభినవ్‌ తెలిపారు. ఈ గ్రంథాన్ని పరిశీలించిన చరిత్ర నిపుణుడు ప్రొఫెసనఖ అలీ ఇలాంటిదే టర్కీ మ్యూజియంలో చూశానన్నారు. ఇది 1050-1605 సంవత్సరాల మధ్య కాలంనాటిదై ఉంటుందని, అప్పట్లో భారతదేశాన్ని మొఘలాయి చక్రవర్తులు […]

రూ. 5 కోట్ల విలువైన పసిడి ఖురాన్‌!
X
హైదరాబాద్‌లో దొరికినట్టు చెబుతున్న ఓ 500 యేళ్ళనాటి ఖురాన్‌ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న దుండగులను మైసూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఖురాన్‌ బంగారు లేపనంతో ఉంది. నిందితులంతా కర్ణాటకలోని రాయచూరు, సింధనూరు, గుల్బర్గా, ఉడిపి, షిమోగ జిల్లాలకు చెందినవారుగా గుర్తించినట్టు మైసూరు జిల్లా ఎస్పీ అభినవ్‌ తెలిపారు. ఈ గ్రంథాన్ని పరిశీలించిన చరిత్ర నిపుణుడు ప్రొఫెసనఖ అలీ ఇలాంటిదే టర్కీ మ్యూజియంలో చూశానన్నారు. ఇది 1050-1605 సంవత్సరాల మధ్య కాలంనాటిదై ఉంటుందని, అప్పట్లో భారతదేశాన్ని మొఘలాయి చక్రవర్తులు పాలించేవారని చెప్పారు. ఈ గ్రంథం ఐదు కోట్ల రూపాయలకు పైగా విలువ చేస్తుందని అంచనా వేశారు. అక్బర్‌ కాలానికి చెందిన ఈ ఖురాన్‌ అరబిక్‌ భాషలో ఉందని ఇందులో 600 పేజీలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
First Published:  13 Aug 2015 11:27 AM IST
Next Story