Telugu Global
NEWS

సింగ‌పూర్ కంటే టీఎస్-ఐపాస్ అత్య‌ద్భుతం: కేసీఆర్ 

తెలంగాణ ప్ర‌భుత్వ నూత‌న పారిశ్రామిక విధానం టీ ఎస్ ఐపాస్  పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన సింగ‌పూర్‌, వియ‌త్నాం దేశాల విధానాల కంటే బ్ర‌హ్మాండంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ న‌గ‌రంలోని హోట‌ల్ తాజ్‌కృష్ణ‌లో జ‌రిగిన భార‌త ప‌రిశ్ర‌మ‌ల స‌మాఖ్య (సీఐఐ) జాతీయ మండ‌లి స‌మావేశంలో అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ పారిశ్రామిక విధానం ఖ‌రారు చేసే ముందు ఆయా దేశాల ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీని కూడా అధ్య‌య‌నం చేశామ‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానంలో అవినీతికి తావులేదు. ఇన్వెస్ట్‌మెంట్ […]

సింగ‌పూర్ కంటే టీఎస్-ఐపాస్ అత్య‌ద్భుతం: కేసీఆర్ 
X
తెలంగాణ ప్ర‌భుత్వ నూత‌న పారిశ్రామిక విధానం టీ ఎస్ ఐపాస్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన సింగ‌పూర్‌, వియ‌త్నాం దేశాల విధానాల కంటే బ్ర‌హ్మాండంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ న‌గ‌రంలోని హోట‌ల్ తాజ్‌కృష్ణ‌లో జ‌రిగిన భార‌త ప‌రిశ్ర‌మ‌ల స‌మాఖ్య (సీఐఐ) జాతీయ మండ‌లి స‌మావేశంలో అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ పారిశ్రామిక విధానం ఖ‌రారు చేసే ముందు ఆయా దేశాల ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీని కూడా అధ్య‌య‌నం చేశామ‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానంలో అవినీతికి తావులేదు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్‌. ఒక్క అప్లికేష‌న్ ఇస్తే చాలు ప‌దిహేను రోజుల్లోనే అనుమ‌తులు మంజూరు చేస్తామ‌ని ఆయ‌న అన్నారు. ఇంక్యూబేట్‌, ఇన్నోవేట్‌, ఇన్‌కార్పొరేట్ అనే నినాదంతో రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధికి కృషి చేస్తున్నామ‌ని, రానున్న రోజుల్లో తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా రూపొందుతుంద‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు.
First Published:  13 Aug 2015 9:58 AM IST
Next Story