Telugu Global
Cinema & Entertainment

పాంథమ్ తో కత్రినా పాత్ర ఏమిటి..?

పాంథమ్ సినిమా ఫస్ట్ లుక్ బయటకొచ్చినప్పటి నుంచి కత్రినాకైఫ్ లుక్, క్యారెక్టర్ పై చర్చ మొదలైంది. ఆమె పాత్రకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. అందుకు తగ్గట్టే సినిమా ప్రచారాన్ని ఆమె చుట్టూనే నడిపిస్తున్నారు దర్శక-నిర్మాతలు. సినిమాలో హీరోగా నటించిన సైఫ్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజాగా కత్రిన యాంగిల్ లోనే మరో ప్రచారం షురూ చేశారు. ఆమె పాత్రకు సంబంధించిన ఛాయల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. పాంథమ్ సినిమాలో కత్రినాకైఫ్ ఓ పార్శీ ఇండియన్ అమ్మాయిగా […]

పాంథమ్ తో కత్రినా పాత్ర ఏమిటి..?
X
పాంథమ్ సినిమా ఫస్ట్ లుక్ బయటకొచ్చినప్పటి నుంచి కత్రినాకైఫ్ లుక్, క్యారెక్టర్ పై చర్చ మొదలైంది. ఆమె పాత్రకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. అందుకు తగ్గట్టే సినిమా ప్రచారాన్ని ఆమె చుట్టూనే నడిపిస్తున్నారు దర్శక-నిర్మాతలు. సినిమాలో హీరోగా నటించిన సైఫ్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజాగా కత్రిన యాంగిల్ లోనే మరో ప్రచారం షురూ చేశారు. ఆమె పాత్రకు సంబంధించిన ఛాయల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. పాంథమ్ సినిమాలో కత్రినాకైఫ్ ఓ పార్శీ ఇండియన్ అమ్మాయిగా కనిపించనుందట. ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలో పనిచేసే వాలంటీర్ గా ఆమె కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే ముంబయి దాడుల నేపథ్యంలో తెరకెక్కిన పాంథమ్ సినిమాకు, కత్రినా చేసిన ఈ పాత్రకు సంబంధం ఏంటనే విషయాన్ని మాత్రం సినిమా యూనిట్ గోప్యంగా ఉంచుతోంది. మరోవైపు ఈ సినిమాలో కత్రినాకైఫ్ నిజంగానే ఒరిజినల్ తుపాకీలు పట్టుకుందని చెబుతున్నారు. సినిమాలో సైఫ్ యాక్టింగ్ ఒకెత్తయితే.. కత్రినా పర్ ఫార్మెన్స్ మరో ఎత్తని చెబుతున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాంథమ్ సినిమాను కత్రినా ఏ మేరకు ఆదుకుంటుందో చూడాలి.
First Published:  13 Aug 2015 12:40 AM IST
Next Story