టి-ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు
తెలంగాణ ఇంటర్ బోర్డుకు, బోర్డు నిర్ణయాలను యధాతథంగా అమలు చేసిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజే మార్కెట్ శాఖకు హైకోర్టు బుధవారం అక్షింతలు వేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఖాతాలను స్తంభింప చేయాలని బ్యాంకులకు రాసే అధికారం టీ.ఇంటర్మీడియట్ బోర్డుకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏ అధికారంతో బోర్డు ఖాతాలను నిలిపివేయమని బ్యాంకులకు లేఖలు రాసారని ప్రశ్నించింది. టీ.బోర్డు ఆదేశాలను పాటించి ఏపీ ఇంటర్ బోర్డు ఖాతాను స్తంభింప చేసిన ఎస్‌బిఐ మొజంజాహీ […]
BY admin13 Aug 2015 10:25 AM IST
X
admin Updated On: 13 Aug 2015 10:38 AM IST
తెలంగాణ ఇంటర్ బోర్డుకు, బోర్డు నిర్ణయాలను యధాతథంగా అమలు చేసిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజే మార్కెట్ శాఖకు హైకోర్టు బుధవారం అక్షింతలు వేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఖాతాలను స్తంభింప చేయాలని బ్యాంకులకు రాసే అధికారం టీ.ఇంటర్మీడియట్ బోర్డుకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏ అధికారంతో బోర్డు ఖాతాలను నిలిపివేయమని బ్యాంకులకు లేఖలు రాసారని ప్రశ్నించింది. టీ.బోర్డు ఆదేశాలను పాటించి ఏపీ ఇంటర్ బోర్డు ఖాతాను స్తంభింప చేసిన ఎస్‌బిఐ మొజంజాహీ మార్కెట్ శాఖను కూడా హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఆ లేఖలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఖాతాలను టీ.బోర్డు స్తంభింప చేయడంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టులోపిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం టీ.బోర్డు, బ్యాంకుల నిర్వాకంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Next Story