షార్‌లో అగ్నిప్రమాదం
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో అగ్నిప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఉన్న ఉపగ్రహ వాహక నౌకలను ప్రయోగించే ఈ కేంద్రంలో అనూహ్యంగా ఈ ప్రమాదం సంభవించింది. ఇవాళ జీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి సంబంధించిన ఇంధనాన్ని మిక్సింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో షార్ ఉద్యోగి ఒకరు, కాంట్రాక్టు ఉద్యోగి మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
BY sarvi12 Aug 2015 7:00 PM IST
sarvi Updated On: 13 Aug 2015 12:24 PM IST

Next Story