త్వరలో ఇప్ప సారా జోరు
తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మత్తు పానీయాలను రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంచాలనే యోచనలో ఉంది. ఇప్పటికే, నగరాల్లోని బార్‌లకు రాత్రిపూట మరో రెండు గంటల అదనంగా తెరిచి ఉంచేందుకు పర్మిషన్ ఇచ్చిన సర్కార్ మరోవైపు గ్రామాల్లో కూడా అధికారిక బెల్ట్ షాపులు, రూ. 15కే మద్యం బాటిళ్ల వ్యాపారంలో దూసుకు పోనుంది. ఇప్పుడు మరో కొత్తరకం సహజసిద్ధమైన మత్తుపానీయం ఇప్పసారాను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇప్పపూలతో తయారు చేసే ఈ సారాకు మెక్సికో దేశంలో తయారయ్యే టకీలా […]
BY admin13 Aug 2015 5:17 AM GMT
X
admin Updated On: 13 Aug 2015 5:38 AM GMT
తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మత్తు పానీయాలను రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంచాలనే యోచనలో ఉంది. ఇప్పటికే, నగరాల్లోని బార్‌లకు రాత్రిపూట మరో రెండు గంటల అదనంగా తెరిచి ఉంచేందుకు పర్మిషన్ ఇచ్చిన సర్కార్ మరోవైపు గ్రామాల్లో కూడా అధికారిక బెల్ట్ షాపులు, రూ. 15కే మద్యం బాటిళ్ల వ్యాపారంలో దూసుకు పోనుంది. ఇప్పుడు మరో కొత్తరకం సహజసిద్ధమైన మత్తుపానీయం ఇప్పసారాను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇప్పపూలతో తయారు చేసే ఈ సారాకు మెక్సికో దేశంలో తయారయ్యే టకీలా పానీయం తరహాలో ఇమేజ్ కల్పించాలని భావిస్తోంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని అడవుల్లో వందలాది ఎకరాల్లో ఇప్పచెట్లు ఉన్నాయి. అనాదిగా ఆ పూలతో గిరిజన కుటుంబాలు సారాను తయారు చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వ ఆంక్షల నేపధ్యంలో వారి సంఖ్య తగ్గింది. ప్రభుత్వమే ఇప్పుడు ఆ పూలను శాస్త్రీయ పద్ధతిలో సారా తయారీకి ఉపయోగించాలని భావిస్తోంది. ఇప్పసారాపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది.
Next Story