ఉద్యమాలపై బాబు ప్రభుత్వం ఉక్కుపాదం
ప్రభుత్వ విధానాల కారణంగా సర్వస్వాన్ని కోల్పోతున్న బాధిత ప్రజానీకం గొంతు నొక్కేస్తోంది. సమస్యలు వెలుగులోకి రాకుండా నియంతృత్వానికి దిగుతోంది. వామపక్ష నేతను అరెస్టులు చేయడానికి, వారిపై అక్రమ కేసులు పెట్టడానికి తెగబడుతోంది. శ్రీకాకుళం ప్రజల విజ్ఞప్తి మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రజల తరపున పోరాడేందుకు పోలాకి వెళుతున్నప్పుడు పోలీసులు ఆయనై ఉక్కుపాదం మోపారు. ఆయన్ను పొలాకి వెళ్లకుండా అడ్డుకున్నారు. రైలు దిగగానే ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్‌కు కారణాలు కూడా చెప్పకుండా గంటల […]
BY sarvi13 Aug 2015 7:17 AM IST
X
sarvi Updated On: 13 Aug 2015 7:17 AM IST
ప్రభుత్వ విధానాల కారణంగా సర్వస్వాన్ని కోల్పోతున్న బాధిత ప్రజానీకం గొంతు నొక్కేస్తోంది. సమస్యలు వెలుగులోకి రాకుండా నియంతృత్వానికి దిగుతోంది. వామపక్ష నేతను అరెస్టులు చేయడానికి, వారిపై అక్రమ కేసులు పెట్టడానికి తెగబడుతోంది. శ్రీకాకుళం ప్రజల విజ్ఞప్తి మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రజల తరపున పోరాడేందుకు పోలాకి వెళుతున్నప్పుడు పోలీసులు ఆయనై ఉక్కుపాదం మోపారు. ఆయన్ను పొలాకి వెళ్లకుండా అడ్డుకున్నారు. రైలు దిగగానే ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్‌కు కారణాలు కూడా చెప్పకుండా గంటల తరబడి నిర్బంధించారు. పట్టణ ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లో ఉంచితే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న భయంతో మారుమూల గ్రామానికి తరలించారు. అయితే అరెస్ట్ సమాచారాన్ని సహచరులకు కూడా తెలియచేయడానికి వీలు లేకుండా పోలీసులు సెల్‌ఫోన్‌ను తీసేసుకున్నారు. తమకు పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఇలా చేశామని మధు అడిగిన ప్రశ్నకు సి.ఐ. సమాధానం ఇచ్చారు. దీనిపై మధు సీఐతో వాగ్వాదానికి దిగగా, ఉన్నతాధికారుల ఆదేశాలతోనే అరెస్ట్ చేశామని సీఐ చెప్పారు. మధు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న సీనియర్ నేత చౌదరి తేజేశ్వరరావుతో సహా 97 మందిని పోలీసులు నిర్భంధించారు. థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం ప్రజల వద్ద నుంచి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తోందని, తమకు న్యాయం చేయాలని అయితే ఆముదాలవలసలో అరెస్ట్ చేసిన కొంత సేపటికే ఈ విషయం రాష్ట్రమంతా తెలిసిపోవడంతో ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు విజయవాడ, విశాఖ, కర్నూలుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ నిరసనలు హోరెత్తాయి. మరోవైపు సిపిఎం పొలిట్‌బ్యూరో ఈ అప్రజాస్వామిక చర్యను తీవ్రంగా ఖండించింది.
Also Read
Next Story