ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే " సీఎం చంద్రబాబు
విభజనతో కుదేలైన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీని ఆదుకునేందుకు ప్రత్యేక హోదా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీని 8 సార్లు కలిసి విన్నవించానని ఆయన చెప్పారు. కేంద్రం కచ్చితంగా ఏపీని ప్రత్యేక హోదాతో ఆదుకుంటుందనే నమ్మకం తనకు ఉందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. మనకు ఇరుగుపొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాజధానుల స్థాయిలో నూతన రాజధాని […]
BY admin13 Aug 2015 4:44 AM GMT
X
admin Updated On: 13 Aug 2015 4:44 AM GMT
విభజనతో కుదేలైన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీని ఆదుకునేందుకు ప్రత్యేక హోదా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీని 8 సార్లు కలిసి విన్నవించానని ఆయన చెప్పారు. కేంద్రం కచ్చితంగా ఏపీని ప్రత్యేక హోదాతో ఆదుకుంటుందనే నమ్మకం తనకు ఉందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. మనకు ఇరుగుపొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాజధానుల స్థాయిలో నూతన రాజధాని అమరావతిని నిర్మిస్తామని ఆయన అన్నారు. నూతన రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఉదారంగా సాయమందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈనెల 19 వరకు మాత్రమే భూసమీకరణ విధానంలో భూములు సేకరిస్తామని, 20న భూసేకరణ నోటీసులు ఇస్తామని సీఎం చెప్పారు. పాత భూసేకరణ చట్టం ప్రకారం రైతుల వద్ద నుంచి భూసేకరణ చేస్తామని ఆయన చెప్పారు.
Next Story