Telugu Global
Others

తోటపల్లి ప్రాజెక్టు రద్దుపై కాంగ్రెస్ ధర్నా

కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టు రద్దుకు నిరసనగా గాగిల్లాపూర్ హైవేపై కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ధర్నాకార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ బూటకమని తేలిందన్నారు. తోటపల్లి ప్రాజెక్టు రద్దు వెనుక ఉన్న మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న […]

కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టు రద్దుకు నిరసనగా గాగిల్లాపూర్ హైవేపై కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ధర్నాకార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ బూటకమని తేలిందన్నారు. తోటపల్లి ప్రాజెక్టు రద్దు వెనుక ఉన్న మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడతామని అన్నారు. ఓపక్క వర్షం కురుస్తున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు వర్షంలోనే ధర్నాను కొనసాగించారు.
First Published:  11 Aug 2015 6:41 PM IST
Next Story