Telugu Global
Others

విద్యుదుత్పత్తికి రూ.16,070 కోట్ల రుణసాయం 

తెలంగాణలో విద్యుత్ ఉత్ప‌త్తి కోసం ప్ర‌భుత్వం  చేస్తున్న ప్ర‌య‌త్నాలు విజ‌య‌వంత‌మ‌వుతున్నాయి. న‌ల్గొండ జిల్లా దామ‌ర‌చ‌ర్ల‌లో నెల‌కొల్పే యాదాద్రి ప‌వ‌ర్ స్టేష‌న్‌లో విద్యుత్ ఉత్ప‌త్తి చేసేందుకు రూర‌ల్ ఎల‌క్ట్రిఫికేష‌న్ కార్పోరేష‌న్ సంస్థ ప్ర‌భుత్వానికి  రూ. 16,070 కోట్ల‌ను సాయం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్ప‌త్తికి ఆర్‌సిఇసి సంస్థ నిధులు అంద‌జేస్తోంది. తెలంగాణ‌లోని యాదాద్రిలో నెల‌కొల్ప‌నున్న ఈ ప్లాంటులో విద్యుత్ ఉత్ప‌త్తికి ఆర్థిక సాయం అందిస్తామ‌ని గ‌తంలోనే ప్ర‌భుత్వానికి హామీనిచ్చింది. ఆ మేర‌కు  ఆర్‌సిఇసి చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ […]

విద్యుదుత్పత్తికి రూ.16,070 కోట్ల రుణసాయం 
X
తెలంగాణలో విద్యుత్ ఉత్ప‌త్తి కోసం ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాలు విజ‌య‌వంత‌మ‌వుతున్నాయి. న‌ల్గొండ జిల్లా దామ‌ర‌చ‌ర్ల‌లో నెల‌కొల్పే యాదాద్రి ప‌వ‌ర్ స్టేష‌న్‌లో విద్యుత్ ఉత్ప‌త్తి చేసేందుకు రూర‌ల్ ఎల‌క్ట్రిఫికేష‌న్ కార్పోరేష‌న్ సంస్థ ప్ర‌భుత్వానికి రూ. 16,070 కోట్ల‌ను సాయం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్ప‌త్తికి ఆర్‌సిఇసి సంస్థ నిధులు అంద‌జేస్తోంది. తెలంగాణ‌లోని యాదాద్రిలో నెల‌కొల్ప‌నున్న ఈ ప్లాంటులో విద్యుత్ ఉత్ప‌త్తికి ఆర్థిక సాయం అందిస్తామ‌ని గ‌తంలోనే ప్ర‌భుత్వానికి హామీనిచ్చింది. ఆ మేర‌కు ఆర్‌సిఇసి చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ రాజీవ్‌శ‌ర్మ సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌లిసి చెక్కును అంద‌చేశారు. గ‌తంలో కూడా పాల్పంచలో 80 మెగాబాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి ప్లాంటు నెల‌కొల్పేందుకు మూడు నెల‌ల క్రితం రూ. 4,321 కోట్ల ను అందించిన ఆర్ సిఇసి మ‌రోసారి తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక స‌మాయం చేసింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కూ రూ. 20,391 కోట్ల‌ను ఆర్ సిఇసి తెలంగాణ‌లో విద్యుత్ ఉత్ప‌త్తికి స‌హాయం చేసిన‌ట్ల‌యింది. ఆర్‌సిఇసి తాను ఇచ్చే రుణ స‌హాయంపై ఇత‌ర రాష్ట్రాలకు 11.5 శాతం వ‌డ్డీ వ‌సూలు చేస్తుండ‌గా, తెలంగాణ‌కు మాత్రం 11 శాత‌మే తీసుకుంటోంది. దీంతో తెలంగాణకు రూ. 500 కోట్ల వరకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఒక రాష్ట్రానికి ఇంత‌పెద్ద మొత్తంలో ఆర్థిక స‌హాయం చేయ‌డం ఇదే మొద‌టిసార‌ని, తెలంగాణ ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధి చూసి, ప్ర‌ణాళిక‌ల‌పై న‌మ్మ‌కంతోనే నిధులు ఇచ్చామ‌ని ఆర్‌సిఇసి చైర్మ‌న్ రాజీవ్ శ‌ర్మ అన్నారు.
First Published:  12 Aug 2015 12:52 AM GMT
Next Story