పట్టిసీమలో పారేది నీళ్లు కాదు ముడుపులు!
ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి టీడీపీని నిరంతరం విమర్శలతో తూర్పారపడుతున్న నేత రఘువీరారెడ్డి. తాజాగా పట్టిసీమపై ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలను ఆలోచనలో పడేశాయి. ఈ నెల 15 ప్రారంభం కానున్న పట్టిసీమ నుంచి వచ్చేది నీళ్లుకాదని, రూ.500 కోట్ల ముడుపులు అని ఆయన ఎద్దేవా చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల సీమకు అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి రాయలసీమ వాసులు, నేతలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు నెత్తీ, నోరూ […]
BY sarvi12 Aug 2015 5:04 AM IST
X
sarvi Updated On: 12 Aug 2015 5:04 AM IST
ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి టీడీపీని నిరంతరం విమర్శలతో తూర్పారపడుతున్న నేత రఘువీరారెడ్డి. తాజాగా పట్టిసీమపై ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలను ఆలోచనలో పడేశాయి. ఈ నెల 15 ప్రారంభం కానున్న పట్టిసీమ నుంచి వచ్చేది నీళ్లుకాదని, రూ.500 కోట్ల ముడుపులు అని ఆయన ఎద్దేవా చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల సీమకు అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి రాయలసీమ వాసులు, నేతలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు నెత్తీ, నోరూ కొట్టుకున్నా ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు విషయంలో మొండిగా ముందుకెళ్తోంది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు చుక్క నీరు కూడా రాదని, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే చెబుతున్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని గుర్తించకపోవడం దారుణమని రఘువీరా వాపోయారు. పట్టిసీమ ప్రాజెక్టును అనంతపురం ఎంపీ జేసీ తదితరులు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న వైనాన్ని రఘువీరా పరోక్షంగా ప్రస్తావించారు. సొంత పార్టీ నేతలే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉన్నా ప్రభుత్వం మొండిగా ముందుకు పోతుందని తనదైన శైలిలో ప్రభుత్వానికి చురకలంటించారు.
Next Story