జర సభ జరగనివ్వండి..ప్లీజ్!
పార్లమెంటు కార్యకలాపాలను జరగనివ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా 15 వేల మంది సంతకాలు చేశారు. ఈ ఆన్‌లైన్ సంతకాల సేకరణలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు. మిగిలిన రెండు రోజులైనా పార్లమెంటును సాగనివ్వాలని.. రాజకీయాలను పక్కనబెట్టి ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కీలక చట్టాలు చేయాల్సిన ఎంపీలు సభను అడ్డుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక దిగ్గజాలు రాహుల్ బజాజ్, ఇన్ఫోసిస్ ఫౌండర్ క్రిస్ గోపాల కృష్ణన్, హీరో మోటో కార్ప్ చీఫ్ పవన్ ముంజాల్, ఆది గోద్రేజ్, జీవికేకి […]
పార్లమెంటు కార్యకలాపాలను జరగనివ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా 15 వేల మంది సంతకాలు చేశారు. ఈ ఆన్‌లైన్ సంతకాల సేకరణలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు. మిగిలిన రెండు రోజులైనా పార్లమెంటును సాగనివ్వాలని.. రాజకీయాలను పక్కనబెట్టి ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కీలక చట్టాలు చేయాల్సిన ఎంపీలు సభను అడ్డుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక దిగ్గజాలు రాహుల్ బజాజ్, ఇన్ఫోసిస్ ఫౌండర్ క్రిస్ గోపాల కృష్ణన్, హీరో మోటో కార్ప్ చీఫ్ పవన్ ముంజాల్, ఆది గోద్రేజ్, జీవికేకి చెందిన సంజయ రెడ్డితోబాటు వేలాదిమంది సంతకాల సేకరణలో పాల్గొన్నారు.
నో బిజినెస్:
లలిత్ గేట్ వ్యవహారంలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేసేంతవరకు పార్లమెంటును అడ్డుకుంటామని విపక్ష కాంగ్రెస్ తేల్చిచెప్పింది. దీంతో మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావించిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్‌టి) బిల్లుకు ఈసారి కూడా మోక్షం అనుమానంగానే ఉంది. పార్లమెంటు బిజినెస్ సాగకపోతే..పరిశ్రమతోబాటు ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని సిఐఐ వంటి సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.రాజకీయ అనిశ్చితి కారణంగా పదేళ్లుగా జిఎస్‌టి బిల్లు మోక్షం కోసం ఎదురుచూస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.