Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పంద్రాగస్ట్ కానుక

తన అభిమానులకు ఈమధ్య దశలవారీగా బహుమతులు అందజేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈమధ్యే తన అబ్బాయ్ అభిరామ్ ఫొటోలు విడుదల చేశాడు. తర్వాత తన కొత్త సినిమాలో కొత్త గెటప్ ను విడుదల చేశాడు. ఆ తర్వాత లండన్ లో కొడుకు పుట్టినరోజు ఫొటోల్ని బయటపెట్టాడు. ఇలా దశలవారిగా ఫ్యాన్స్ కు ఏదో ఒక ట్రీట్ అందిస్తూనే ఉన్నాడు  ఎన్టీఆర్. ఇప్పుడు ఆగస్ట్ 15 కానుకగా మరో బహుమతి ఇచ్చేందుకు సిద్ధమౌతున్నాడు. ఇప్పటికే విడుదలైన తన కొత్త […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పంద్రాగస్ట్ కానుక
X
తన అభిమానులకు ఈమధ్య దశలవారీగా బహుమతులు అందజేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈమధ్యే తన అబ్బాయ్ అభిరామ్ ఫొటోలు విడుదల చేశాడు. తర్వాత తన కొత్త సినిమాలో కొత్త గెటప్ ను విడుదల చేశాడు. ఆ తర్వాత లండన్ లో కొడుకు పుట్టినరోజు ఫొటోల్ని బయటపెట్టాడు. ఇలా దశలవారిగా ఫ్యాన్స్ కు ఏదో ఒక ట్రీట్ అందిస్తూనే ఉన్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఆగస్ట్ 15 కానుకగా మరో బహుమతి ఇచ్చేందుకు సిద్ధమౌతున్నాడు. ఇప్పటికే విడుదలైన తన కొత్త గెటప్ తో పాటు కొత్త సినిమాకు సంబంధించి మరో స్టిల్ ను కూడా ఆరోజున విడుదల చేయాలనుకుంటున్నారు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇందులో తారక్ గెటప్ కు అనూహ్య స్పందన వచ్చింది. గుబురు గడ్డం, డిఫరెంట్ హెయిర్ స్టయిల్ తో అదరగొట్టాడు. దీనికి కొనసాగింపుగా మరో స్టిల్ విడుదల చేయాలనుకుంటున్నారు. ఈసారి సెల్ఫీ తరహా స్టిల్స్ కాకుండా.. ప్రొఫెషనల్ గా షూట్ చేసిన సినిమా స్టిల్ నే విడుదల చేయాలనుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.
First Published:  12 Aug 2015 12:33 AM IST
Next Story