గూగుల్ సీఈవోగా భారతీయుడు
ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్ సీఈవోగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ప్రపంచ ఐటీ రంగంలో మరో భారతీయ ఆణిముత్యం మెరిసింది. సుందర్ అంకితభావమే అతడిని గూగుల్ సీఈవో స్థాయికి తీసుకు వచ్చిందని గూగుల్ సహవ్యవస్థాపకులు లార్రీ పేజ్ ప్రశంసించారు. 43 సంవత్సరాల సుందర్ పిచాయ్ చెన్నయ్ కి చెందిన వ్యక్తి. ఖరగ్‌పూర్ ఐఐటీలో బిటెక్ చదివిన ఆయన ప్రస్తుతం ఇంటర్నెట్ బిజినెస్‌లో ప్రొడక్ట్, ఇంజనీరింగ్ విభాగానికి ఇన్ ఛార్జిగా […]
BY sarvi12 Aug 2015 6:39 AM IST
X
sarvi Updated On: 12 Aug 2015 6:39 AM IST
ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్ సీఈవోగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ప్రపంచ ఐటీ రంగంలో మరో భారతీయ ఆణిముత్యం మెరిసింది. సుందర్ అంకితభావమే అతడిని గూగుల్ సీఈవో స్థాయికి తీసుకు వచ్చిందని గూగుల్ సహవ్యవస్థాపకులు లార్రీ పేజ్ ప్రశంసించారు. 43 సంవత్సరాల సుందర్ పిచాయ్ చెన్నయ్ కి చెందిన వ్యక్తి. ఖరగ్‌పూర్ ఐఐటీలో బిటెక్ చదివిన ఆయన ప్రస్తుతం ఇంటర్నెట్ బిజినెస్‌లో ప్రొడక్ట్, ఇంజనీరింగ్ విభాగానికి ఇన్ ఛార్జిగా ఉన్నారు. 2004లో గూగుల్ సంస్థలో అడుగు పెట్టిన సుందర్ 11 సంవత్సరాలు తిరిగే సరికే ఆ సంస్థలోని అత్యున్నత పదవిని అధిష్టించారు. సుందర్ ప్రతిభను గుర్తించిన ట్విట్టర్ 2011లోనే అతనికి భారీ వేతనం ఆఫర్ చేసినా సుందర్ గూగుల్‌లోనే ఉండి పోయారు. సుందర్ పిచాయ్ గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేసి ఆయనకు అభినందనలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల, గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ సచిమిడిట్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ లు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచ కార్పోరేట్ దిగ్గజాల్లో భారతీయులు
భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ప్రతిష్టాత్మక సంస్థ గూగుల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడంతో ప్రపంచ కార్పోరేట్ రంగంలో భారతీయ దిగ్గజాలపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే ఎంతోమంది భారతీయులు ప్రపంచ కార్పోరేట్ రంగంలో దిగ్గజాలుగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. వారిలో ముఖ్యులు మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదేళ్ల(47) నోకియా కంపెనీ హెడ్ రాజీవ్ సూరి (47), శాన్‌డిస్కో ప్రెసిడెంట్ సంజయ్ మోహ్రోత్రా (56), ఆడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్ (52), పెప్సికో సీఈవో ఇంద్రసూయి(59), ఆర్సెలర్ ఉక్కు తయారీ కంపెనీ చైర్మన్, సీఈవో లక్ష్మీ మిట్టల్ (64), మల్టీ నేషనల్ ఆల్కహాల్ బేవరేజ్ కంపెనీ డియాజియో సీఈవో ఇవాన్ మెనెంజిస్(56)తోపాటు ఇంకా పలువురు ప్రముఖులు కార్పోరేట్ దిగ్గజాలుగా కార్పొరేట్ రంగాన్ని శాసిస్తున్నారు.
Next Story