పొట్టని తగ్గించాలంటే...!
మనం బరువెక్కుతున్నామనే విషయాన్ని లోకానికి ముందుగా చెప్పేది మన పొట్టే. మహిళల్లో పొత్తికడుపు పెరగటం ఎక్కువగా కనబడుతుంది. శరీరం లావున్నా పొట్ట సమతలంగా ఉంటే అంత లావుగా అనిపించరు. శరీరం కనిపించేతీరు అంటే లుక్ దెబ్బతినదు. సరే…పొట్టని తగ్గించుకుంటే బాగానే ఉంటుంది…మరి ఎలా? అంటారా…. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితంగా పొట్టని తగ్గించుకునే కొన్ని పద్ధతులను, ఆహార నియమాలను ఆయుర్వేదం చెప్పింది…అవే ఇవి గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసంతో పాటు కాస్త ఉప్పు కలుపుకుని ఉదయాన్నే […]
మనం బరువెక్కుతున్నామనే విషయాన్ని లోకానికి ముందుగా చెప్పేది మన పొట్టే. మహిళల్లో పొత్తికడుపు పెరగటం ఎక్కువగా కనబడుతుంది. శరీరం లావున్నా పొట్ట సమతలంగా ఉంటే అంత లావుగా అనిపించరు. శరీరం కనిపించేతీరు అంటే లుక్ దెబ్బతినదు. సరే…పొట్టని తగ్గించుకుంటే బాగానే ఉంటుంది…మరి ఎలా? అంటారా…. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితంగా పొట్టని తగ్గించుకునే కొన్ని పద్ధతులను, ఆహార నియమాలను ఆయుర్వేదం చెప్పింది…అవే ఇవి
- గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసంతో పాటు కాస్త ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే శరీరంలో మెటబాలిజం రేటు పెరిగి, పొట్టలో పేరుకున్న కొవ్వు క్రమంగా తగ్గుతుంది. శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
- మల్లెపువ్వుల్లాంటి తెల్లని సన్నబియ్యం అన్నంపై మీకున్న ఇష్టాన్ని చంపుకోవాల్సిందే. ముడిబియ్యంతో పాటు జొన్నలు, సజ్జలు లాంటి ఇతర తృణధాన్యాలు, క్వినోవా, ఓట్స్ తదితరాలకు మీ ఓటు వేయాల్సిందే.
- తీపి పదార్థాలు, స్వీట్ డ్రింక్స్ కి పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలకు నో చెప్పండి. ఇలాంటి ఆహారమే పొట్ట, తొడల ప్రాంతంలో త్వరగా కొవ్వు పేరుకునేలా చేస్తుంది. వీటితో పాటు పిండి పదార్థాలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతోంది ఆయుర్వేదం.
- ప్రతిరోజూ సరిపడా మంచినీరు తాగాలి. క్రమం తప్పకుండా రోజంతా తరచుగా మంచినీరు తాగుతుంటే అది శరీరంలో జీవక్రియ వేగంగా జరిగేందుకు తోడ్పడి, విషపదార్థాలను బయటకు పంపుతుంది.
- రెండు లేదా మూడు పచ్చి వెల్లుల్లి రెబ్బలను ఉదయాన్నే తీసుకుని ఆ తరువాత నిమ్మరసం తాగడం వలన మరింత మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది కూడా.
- మాంసాహారం అంటే ఎంత మక్కువ ఉన్నా, పొట్ట తగ్గి పోయి అందంగా కనబడాలనే ఆశ ఉంటే మాత్రం ఆ వంటకాలను దూరంగా పెట్టాల్సిందే.
- రోజూ ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా పళ్లు తీసుకోవాలి. దీంతో శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమకూరుతాయి.
- ఎసిడిటి లాంటి సమస్యలు లేకపోతే వంటల్లో మసాలా దినుసులను ఎక్కువగా వాడండి. దాల్చిన చక్క, అల్లం, మిరియాలు వీటన్నింటిలో శరీరానికి మేలు చేసే అంశాలు చాలా ఉన్నాయి. ఇవి శరీరం ఇన్సులిన్‌ని ఉపయోగించుకునేలా చేసి, రక్తంలో షుగరుని తగ్గిస్తాయి.
- ఉప్పుతో పాటు, పాల ఉత్పత్తులైన వెన్న, ఐస్ క్రీముల వంటివి తగ్గించాలి.
- శరీరం బరువు తగ్గాలంటే మధ్యాహ్నం పూట నిద్రని నివారించాలి. మధ్యాహ్నపు నిద్ర, మనలో జీవక్రియని మందగింపచేసి తక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చేస్తుంది.