జీఎస్టీ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్
వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశ పెట్టేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. అయితే, దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పలు అభ్యంతరాలను లేవెనెత్తి చర్చను అడ్డుకుంది. ఈ బిల్లును ప్రవేశ పెట్టేందుకు కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీ లేచి నిలబడగానే కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేచి నిలబడి వెల్‌లోకి దూసుకెళ్లారు. బిల్లుపై సభాకార్యక్రమాల సలహా సంఘం (బీఏసీ)లో చర్చించలేదని, ఆ బిల్లుపై సభలో చర్చించేందుకు సమయం […]
BY sarvi11 Aug 2015 6:36 PM IST
X
sarvi Updated On: 12 Aug 2015 6:59 AM IST
వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశ పెట్టేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. అయితే, దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పలు అభ్యంతరాలను లేవెనెత్తి చర్చను అడ్డుకుంది. ఈ బిల్లును ప్రవేశ పెట్టేందుకు కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీ లేచి నిలబడగానే కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేచి నిలబడి వెల్‌లోకి దూసుకెళ్లారు. బిల్లుపై సభాకార్యక్రమాల సలహా సంఘం (బీఏసీ)లో చర్చించలేదని, ఆ బిల్లుపై సభలో చర్చించేందుకు సమయం కేటాయించలేదని, అందువల్ల జీఎస్టీ బిల్లుపై సభలో చర్చ చేపట్టేందుకు వీలు లేదని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ అన్నారు. కాంగ్రెస్ సభ్యుల చర్యపై మంత్రి జైట్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ జీఎస్టీ బిల్లును అడ్డుకుని దేశాభివృద్ధిని అడ్డుకుంటోందని అన్నారు. దేశాభివృద్ధిని అడ్డుకోవడం కోసమే కాంగ్రెస్ లలిత్ మోదీ సుష్మ వివాదాన్ని వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. జీఎస్టీ బిల్లు ఇది వరకు సభ ముందుకు వచ్చినప్పుడు దానికోసం బీఏసీ 4 గంటల సమయం కేటాయించిందని, ఆ తర్వాత బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరడంతో కమిటి సవరించిన బిల్లుతో సహా ఆ బిల్లును సభకు తిప్పి పంపిందని, దాన్ని ఇప్పుడు పరిశీలనకు తీసుకోవాలని మంత్రి సూచించారు. అయితే, కాంగ్రెస్ సభ్యులు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ వాదనతో విభేదించారు.
Next Story