బీహార్‌లో కూటమిగా నితీష్, లాలూ, కాంగ్రెస్
బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా మూడు పార్టీలు ఒక్కటయ్యాయి. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్ పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. ఇప్పుడు అధికారంలో ఉన్న జనతాదళ్ (యు) వంద స్థానాల్లోను, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వం వహిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ వంద స్థానాల్లోను, కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లోను పోటీ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు మూడు పార్టీల నేతలు సంయుక్త ప్రకటన చేశాయి. […]
BY sarvi12 Aug 2015 4:19 AM GMT
X
sarvi Updated On: 12 Aug 2015 4:24 AM GMT
బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా మూడు పార్టీలు ఒక్కటయ్యాయి. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్ పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. ఇప్పుడు అధికారంలో ఉన్న జనతాదళ్ (యు) వంద స్థానాల్లోను, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వం వహిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ వంద స్థానాల్లోను, కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లోను పోటీ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు మూడు పార్టీల నేతలు సంయుక్త ప్రకటన చేశాయి. భారతీయ జనతాపార్టీని బీహార్‌కు దూరంగా ఉండడం లక్ష్యంగానే ఈ ఎన్నికల ఒప్పందం చేసుకున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ ప్రకటించారు. బీజేపీని తిరిగి నాగపూర్ పంపించడమే తమ ధ్యేయమని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.
Next Story