ఓటుకు నోటు కేసులో లోకేష్ కారు డ్రైవర్
ఓటుకు నోటు కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్ డ్రైవరు కొండల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కొండల్‌రెడ్డి కోసం మంగళవారం టీడీపీ ఆఫీసుకు ఏసీబీ అధికారులు వెళ్లారు. అయితే ఆఫీసులో కొండల్‌రెడ్డి లేకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్ గన్‌మెన్‌లతో కొండల్‌రెడ్డి తరచూ మాట్లాడే వాడని ఏసీబీ అధికారులు చెప్పారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణల సారాంశం తెలుసుకోవలసిన అవసరం ఉందని వారన్నారు. కొండల్‌రెడ్డికి దీనికి సంబంధించి బుధవారం నోటీసులు జారీ చేశారు. గురువారం […]
BY sarvi11 Aug 2015 6:40 PM IST
sarvi Updated On: 12 Aug 2015 10:05 AM IST
ఓటుకు నోటు కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్ డ్రైవరు కొండల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కొండల్‌రెడ్డి కోసం మంగళవారం టీడీపీ ఆఫీసుకు ఏసీబీ అధికారులు వెళ్లారు. అయితే ఆఫీసులో కొండల్‌రెడ్డి లేకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్ గన్‌మెన్‌లతో కొండల్‌రెడ్డి తరచూ మాట్లాడే వాడని ఏసీబీ అధికారులు చెప్పారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణల సారాంశం తెలుసుకోవలసిన అవసరం ఉందని వారన్నారు. కొండల్‌రెడ్డికి దీనికి సంబంధించి బుధవారం నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి హాజరుకావాల్సిందిగా ఆదేశించారు.
Next Story