ఏపీలో 40 వేల ఎకరాల వక్ఫ్ భూముల కబ్జా
రాష్ట్రంలో… మొత్తం 60, 770 ఎకరాల వక్ఫ్ భూములుండగా అందులో 40 వేల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని రాష్ట్ర సమాచార శాఖా మంత్రి పల్లె రఘునాధ్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను జీవో నెం 18 ద్వారా స్వాధీనం చేసుకుంటామన్నారు. అలాగే ముస్లింల షాదీ పథకం ద్వారా వివాహం చేసుకునే జంటకు ప్రభుత్వం తరుపున రూ. 50 వేలను చెల్లిస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా జరుపుతామన్నారు.
BY sarvi11 Aug 2015 6:42 PM IST
sarvi Updated On: 12 Aug 2015 10:12 AM IST

Next Story