Telugu Global
Others

టెర్రరిస్ట్‌ నవీద్‌ను పట్టిచ్చిన యువకులకు శౌర్యచక్ర!

పాకిస్థాన్‌ ఉగ్రవాది నవీద్‌ను అత్యంత సాహసంతో ఎదుర్కొని, అతనిని ప్రాణాలతో పట్టిచ్చిన ఇద్దరు కాశ్మీరీ యువకులకు పోలీసు శాఖలో ఉద్యోగాలు దక్కాయి. వారు చూపిన అసమాన ధైర్య సాహసాలకు అరుదైన పురస్కారం లభించింది. ఈ సాహసం చేసిన రాష్ట్ర పౌరులు రాకేష్ కుమార్ శర్మ, విక్రంజీత్‌లకు జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రకుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వీరిద్దరి పేర్లనూ భారతదేశంలో ప్రతిష్ఠాత్మక “శౌర్యచక్ర” పురస్కారాలకు సిఫారసు […]

టెర్రరిస్ట్‌ నవీద్‌ను పట్టిచ్చిన యువకులకు శౌర్యచక్ర!
X

పాకిస్థాన్‌ ఉగ్రవాది నవీద్‌ను అత్యంత సాహసంతో ఎదుర్కొని, అతనిని ప్రాణాలతో పట్టిచ్చిన ఇద్దరు కాశ్మీరీ యువకులకు పోలీసు శాఖలో ఉద్యోగాలు దక్కాయి. వారు చూపిన అసమాన ధైర్య సాహసాలకు అరుదైన పురస్కారం లభించింది. ఈ సాహసం చేసిన రాష్ట్ర పౌరులు రాకేష్ కుమార్ శర్మ, విక్రంజీత్‌లకు జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రకుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వీరిద్దరి పేర్లనూ భారతదేశంలో ప్రతిష్ఠాత్మక “శౌర్యచక్ర” పురస్కారాలకు సిఫారసు చేశారు. ఈ నెల 5వ తేదీన ఉధంపూర్ జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామం చిర్డీలోకి పాక్ సరిహద్దుల గుండా భారత్‌లోకి చొచ్చుకు వచ్చిన ఉగ్రవాది మహమ్మద్ నవీద్, అతని సహచరుడు కలసి భారత జవాన్ల కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఇద్దరు భారత జవాన్లతోపాటు ఒక తీవ్రవాది కూడా మరణించారు. ఆ తర్వాత రాకేష్, బిక్రంలతో పాటు మరికొందరిని బందీలుగా చేసుకుని తప్పించుకునేందుకు ప్రయత్నించిన నవీద్‌పై వారిద్దరూ తిరగబడి, భారత సైన్యానికి పట్టించారు. వీరి సాహసాన్ని దేశ ప్రజలంతా మెచ్చుకున్నారు. వీరిద్దరికీ ఉద్యోగాలు ఇచ్చిన కాశ్మీర్ పోలీస్ శాఖ, వారి అర్హతల విషయంలో నిబంధనల్ని సడలించాల్సిందిగా రాష్ట్ర సర్కారును కోరుతూ లేఖ రాసింది. అంతటితో ఆగిపోకుండా శౌర్యచక్రకు కూడా సిఫార్సు చేసింది.

First Published:  11 Aug 2015 6:15 PM IST
Next Story