రాణి రుద్రమ రిలీజ్ కి రె'ఢీ...
డ్రీమ్ ప్రాజెక్ట్ ను సాకారం చేసుకున్న దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. కెరీర్ పరంగా డు ఆర్ డై అనే సందర్భంలో తనే దర్శక నిర్మాత గా మారి రాణిరుద్రమ చిత్రం చేశారు. అనుష్క లీడ్ రోల్ లో కాకతీయుల వీరనారి రాణిరుద్రమ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే బడ్జెట్ కాస్తా భారీగా ఎక్కడంతో… సినిమాను మార్కెట్ చేసుకోవడంలో గుణశేఖర్ కొంత సతమతం అవుతున్నారు. సినిమా నిడివి ఎక్కువ వుండటంతో..బయ్యర్లు […]
BY admin11 Aug 2015 12:36 AM IST
X
admin Updated On: 11 Aug 2015 6:48 AM IST
డ్రీమ్ ప్రాజెక్ట్ ను సాకారం చేసుకున్న దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. కెరీర్ పరంగా డు ఆర్ డై అనే సందర్భంలో తనే దర్శక నిర్మాత గా మారి రాణిరుద్రమ చిత్రం చేశారు. అనుష్క లీడ్ రోల్ లో కాకతీయుల వీరనారి రాణిరుద్రమ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే బడ్జెట్ కాస్తా భారీగా ఎక్కడంతో… సినిమాను మార్కెట్ చేసుకోవడంలో గుణశేఖర్ కొంత సతమతం అవుతున్నారు. సినిమా నిడివి ఎక్కువ వుండటంతో..బయ్యర్లు తగ్గించమని చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో మాయాబజార్ లా ఎక్కువ నిడివి పెట్టుకుంటే ఎవరు చూస్తారు..? అని బయ్యర్లు ఖర కండిగా చెప్పేశారట.
ఇక ఆడియో విడుదలైన తరువాత…. మంచి స్పందన వచ్చింది. బయ్యర్లు కు ధర ఎక్కువ చెప్పడంతో కొనడానికి ఎవరు ముందుకు రాలేదనే టాక్ వినిపించింది. బాహుబలి ఎఫెక్ట్ తో రాణిరుద్రమ విజువల్స్ నాణ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాస్తవంగా మే 25న సినిమా రిలీజ్ చేద్దామని ఆలోచన చేశారు. కానీ అది జరగలేదు. బాహుబలి తరువాత ..రిలీజ్ కు చాల సమయం తీసుకున్నారు. దీంతో అభిమానుల్లో రాణిరుద్రమ విడుదల విషయంలో డైలామా ఏర్పడటంతో.. చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి..సెప్టంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అదే విషయం మళ్లీ మీడియా వారికి తెలియ చేసి.. విడుదల విషయంలో ఈ సారి పోస్ట్ పోన్ మెంట్ ఉండదనే క్లారీటి ఇస్తున్నారు. అల్లు అర్జున్, రానా ఈ చిత్రంలో కీ రోల్స్ చేశారు. చారిత్రిక ప్రాధాన్యం వున్న కథ కావడం… సినిమాకు ప్లస్ అయితే.. హీరో లేక పోవడం అనేది బిజినెస్ పరంగా కొంత మైనస్ అనే టాక్ వినిపిస్తుంది మరి. తెలుగు తో పాటు.. తమిళ్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
Next Story