అనంత సంపదల రేడు
ఆనంద నిలయంలో కొలువైన బంగారు స్వామి..అనంత సంపదలతో తులతూగుతున్నారు. ఆకాశరాజు దగ్గర్నుంచి..కృష్ణదేవరాయలు వరకు..మొఘలుల దగ్గర్నుంచి బ్రిటీష్ దొరల వరకు సమర్పించిన వజ్రవైఢ్యూర్యాలు, తిరువాభరణాలతో, సహస్రనామ మాలతో, శంఖు చక్రాలతో, పాదపద్మాలతో, మరకతమాణిక్యాలతో అలంకృతుడై చిరునవ్వుతో అభయహస్తమిస్తున్నాడు. అంతులేని భక్తుల కోరికలు తీర్చి నిలువుదోపిడీ తీసుకోవడంలోనూ వడ్డీకాసులవాడు ఘనుడే! శ్రీనివాసుడు భక్తులపాలిట కొంగు బంగారమేకాదు., కొండంత బంగారు సంపదతో తులతూగుతున్నాడు. అవును..నిత్యం స్వామివారికి కనీసం 80 నుంచి 100 కేజీల బంగారం కానుకల రూపంలో హుండీలో సమర్పిస్తున్నారు భక్తులు. అలా టన్నుల […]
ఆనంద నిలయంలో కొలువైన బంగారు స్వామి..అనంత సంపదలతో తులతూగుతున్నారు. ఆకాశరాజు దగ్గర్నుంచి..కృష్ణదేవరాయ
శ్రీనివాసుడు భక్తులపాలిట కొంగు బంగారమేకాదు., కొండంత బంగారు సంపదతో తులతూగుతున్నాడు. అవును..నిత్యం స్వామివారికి కనీసం 80 నుంచి 100 కేజీల బంగారం కానుకల రూపంలో హుండీలో సమర్పిస్తున్నారు భక్తులు. అలా టన్నుల కొద్దీ వస్తున్నబంగారాన్నిటీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తోంది.
శ్రీవారి పేరిట నాలుగున్నర టన్నుల గోల్డ్ డిపాజిట్
2010 నుంచి టీటీడీ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రారంభించింది. నగల రూపంలో, బిస్కెట్ల రూపంలో హుండీలో భక్తులు సమర్పించిన బంగారాన్ని ఎస్‌బిఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లలో డిపాజిట్ చేస్తోంది. అలా 2010, 2011, 2014లలో నాలుగున్నర టన్నుల బంగారాన్ని డిపాజిట్ చేసింది. 2014 ఆగస్టులో అత్యధికంగా 1800 కేజీల గోల్డ్‌ని ఒకేసారి ఎస్‌బిఐలో డిపాజిట్ చేసింది.
ఏటా 80 కిలోల బంగారం వడ్డీ
గోల్డ్ డిపాజిట్లపై వడ్డీని కూడా టీటీడీ బంగారం రూపంలోనే తీసుకుంటోంది. అలా నాలుగున్నర టన్నుల బంగారం డిపాజిట్లపై ఏటా 80 కిలోల గోల్డ్ వడ్డీగా ఇచ్చేలా బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది.
త్వరలోనే మరో టన్ను బంగారం డిపాజిట్:
గోవిందుని పేరిట వివిధ బ్యాంకుల్లో నాలుగున్నర టన్నుల గోల్డ్ డిపాజిట్ చేసిన టీటీడీ త్వరలోనే మరో టన్ను బంగారం బ్యాంకుల్లో వేయనుంది. దీంతో శ్రీవారి గోల్డ్ డిపాజిట్లు ఐదున్నర టన్నులకు చేరుతాయి. వాటి విలువ ప్రస్తుత బంగారం రేటు ప్రకారం 1320 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా స్వర్ణ సంపదతో వేయినామాలవాడు వేయిటన్నులవాడుగా వెలుగొందాలని భక్తులు కోరుకుంటున్నారు.
అయితే శ్రీవారు మాత్రం..తన వైభోగాన్ని కాదు..పాదాలను చూడమని కటి హస్తంతో సూచిస్తున్నారు. సంపద కాదు..సన్నిధి ముఖ్యమని చిద్విలాసం చేస్తున్నాడు. తిరుమల వేంకటేశ్వరుడు నిజంగా బంగారుకొండే!