Telugu Global
Others

గివ్ ఇట్ అప్ లో తెలుగు రాష్ట్రాల‌కు 12, 13 స్థానాలు 

సిలిండ‌ర్ల‌పై రాయితీను వ‌దులుకునేందుకు కేంద్రం ఆరంభించిన గివ్ ఇట్ అప్ కార్య‌క్ర‌మంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 12వ స్థానం, తెలంగాణ‌కు 13వ స్థానం ద‌క్కాయి.  దేశ‌వ్యాప్తంగా 13, 86,885 మంది  గ్యాస్ రాయితీని వ‌దులుకున్నారు. స‌బ్సిడీ గ్యాస్‌ను వ‌దులుకున్న రాష్ట్రాల్లో ఉత్త‌ర ప్ర‌దేశ్  మొద‌టి స్థానంలో ఉంది. యూపీలో 2.45 ల‌క్ష‌ల మంది  గ్యాస్‌పై స‌బ్సిడీని వ‌దులుకున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 45, 559 మంది,. తెలంగాణ‌లో 33, 777 మంది గ్యాస్ రాయితీను  వ‌దులుకున్నార‌ని […]

గివ్ ఇట్ అప్ లో తెలుగు రాష్ట్రాల‌కు 12, 13 స్థానాలు 
X
సిలిండ‌ర్ల‌పై రాయితీను వ‌దులుకునేందుకు కేంద్రం ఆరంభించిన గివ్ ఇట్ అప్ కార్య‌క్ర‌మంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 12వ స్థానం, తెలంగాణ‌కు 13వ స్థానం ద‌క్కాయి. దేశ‌వ్యాప్తంగా 13, 86,885 మంది గ్యాస్ రాయితీని వ‌దులుకున్నారు. స‌బ్సిడీ గ్యాస్‌ను వ‌దులుకున్న రాష్ట్రాల్లో ఉత్త‌ర ప్ర‌దేశ్ మొద‌టి స్థానంలో ఉంది. యూపీలో 2.45 ల‌క్ష‌ల మంది గ్యాస్‌పై స‌బ్సిడీని వ‌దులుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 45, 559 మంది,. తెలంగాణ‌లో 33, 777 మంది గ్యాస్ రాయితీను వ‌దులుకున్నార‌ని కేంద్ర పెట్రోలియం శాఖ విడుద‌ల చేసిన గణాంకాలు తెలిపాయి. యూపీ త‌ర్వాత స్థానాల్లో మ‌హారాష్ట్ర‌, ఢిల్లీలున్నాయి. ఆర్థికంగా వెనుక‌బ‌డిన కుటంబాల‌ను ఆదుకుని, వారికి మ‌రిన్ని రాయితీ సిలిండ‌ర్లు ఇచ్చేందుకు వీలుగా కేంద్రం గివ్ ఇట్ అప్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది.
First Published:  10 Aug 2015 6:38 PM IST
Next Story