Telugu Global
Others

రూ. 1000 కోట్ల భూమిపై సర్కారు కన్ను!

రాజ‌ధాని న‌గ‌రం న‌డిబొడ్డునున్న  25 ఎక‌రాల ఎగ్జిబిష‌న్ గ్రౌండును ప్ర‌భుత్వ భూమిని  ప్రైవేట్ ప‌రం చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. నిజాం హ‌యాంలో ఈ భూమిని లీజు ప‌ద్ధ‌తిలో సొసైటీకి అప్ప‌చెప్పారు. అప్ప‌టి నుంచి సొసైటీ ప్ర‌భుత్వానికి నామమాత్ర‌పు ఫీజు ఏడాదికి రూ. 10 వేలు చెల్లిస్తోంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న‌ప్పుడు 2002లో  సొసైటీ లీజును  2052 వ‌ర‌కు పొడిగించారు. అయితే, ఇప్పుడు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆ భూమిని క‌మిష‌న్ల కోసం సొసైటీకే ధారాదత్తం చేయాల‌ని భావిస్తోంద‌ని, అందుకోసం […]

రూ. 1000 కోట్ల భూమిపై సర్కారు కన్ను!
X
రాజ‌ధాని న‌గ‌రం న‌డిబొడ్డునున్న 25 ఎక‌రాల ఎగ్జిబిష‌న్ గ్రౌండును ప్ర‌భుత్వ భూమిని ప్రైవేట్ ప‌రం చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. నిజాం హ‌యాంలో ఈ భూమిని లీజు ప‌ద్ధ‌తిలో సొసైటీకి అప్ప‌చెప్పారు. అప్ప‌టి నుంచి సొసైటీ ప్ర‌భుత్వానికి నామమాత్ర‌పు ఫీజు ఏడాదికి రూ. 10 వేలు చెల్లిస్తోంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న‌ప్పుడు 2002లో సొసైటీ లీజును 2052 వ‌ర‌కు పొడిగించారు. అయితే, ఇప్పుడు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆ భూమిని క‌మిష‌న్ల కోసం సొసైటీకే ధారాదత్తం చేయాల‌ని భావిస్తోంద‌ని, అందుకోసం ప్ర‌భుత్వ యంత్రాంగంతో క‌స‌ర‌త్తు కూడా పూర్తి చేసింద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ 24 ఎక‌రాల 675 గుంట‌ల ప్ర‌భుత్వ భూమికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అంద‌చేయాల్సిందిగా జిల్లా క‌లెక్ట‌రును కూడా ఆదేశించింది. ఈ ఎగ్జిబిస‌న్ గ్రౌండ్‌లో అనేక విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలున్నాయి. అయితే, సొసైటీ ప‌నితీరు ఆక్షేప‌ణీయంగా ఉంద‌ని, లీజు ఉన్న‌ప్ప‌టికీ త‌మ‌ను ఖాళీ చేయ‌మ‌ని ఒత్తిడి చేస్తున్నాయ‌ని గ్రౌండ్ లోని వివిధ సంస్థ‌ల నిర్వాహ‌కులు చెబుతున్నారు. ప్ర‌భుత్వం క‌నుక సొసైటీ పేరుతోనే భూమిని రిజిస్ట‌ర్ చేస్తే త‌మ‌ను అందులో అడుగు కూడా పెట్ట‌నీయ‌ర‌ని వాపోతున్నారు. మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఈ సొసైటీకి అధ్య‌క్షుడుగా ఉన్నారు. సొసైటీ ఇచ్చే క‌మిష‌న్‌కు క‌క్కుర్తి ప‌డే ప్ర‌భుత్వం ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటోంద‌ని, ప్ర‌భుత్వ భూమిని సొసైటీకి అప్ప‌గిస్తే చూస్తూ ఊరుకోమ‌ని ప్ర‌జాసంఘాలు హెచ్చ‌రిస్తున్నాయి.
First Published:  11 Aug 2015 8:13 AM IST
Next Story