ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్ధులు నిల్
రాష్ట్రంలో జరుగుతున్న ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తోంది. జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు కలిగిన కాలేజీలు, జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు లేక పోయిన హైకోర్టు నుంచి అనుమతి పొందిన కళాశాలలు, ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీల పరిధిలోని కాలేజీలతో పాటు మొత్తం 304 కళాశాలల్లో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కన్వీనర్ కోటా అడ్మిషన్లు చేపట్టింది. అయితే, కాలేజీ యాజమాన్యాలు ఆశించినంతగా కళాశాలల్లో విద్యార్ధులు చేరలేదు. కన్వీనర్ కోటా విభాగంలో కూడా విద్యార్ధుల అడ్మిషన్ల ప్రక్రియ చాలా […]
BY sarvi10 Aug 2015 1:05 PM GMT
X
sarvi Updated On: 11 Aug 2015 12:50 AM GMT
రాష్ట్రంలో జరుగుతున్న ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తోంది. జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు కలిగిన కాలేజీలు, జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు లేక పోయిన హైకోర్టు నుంచి అనుమతి పొందిన కళాశాలలు, ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీల పరిధిలోని కాలేజీలతో పాటు మొత్తం 304 కళాశాలల్లో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కన్వీనర్ కోటా అడ్మిషన్లు చేపట్టింది. అయితే, కాలేజీ యాజమాన్యాలు ఆశించినంతగా కళాశాలల్లో విద్యార్ధులు చేరలేదు. కన్వీనర్ కోటా విభాగంలో కూడా విద్యార్ధుల అడ్మిషన్ల ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది. జెఎన్టీయూ గుర్తింపు లేక పోయినా హైకోర్టు అనుమతి తీసుకుని అడ్మిషన్లు ప్రారంభించిన కళాశాలలకు కూడా నిరాశే ఎదురైంది. పది ఇంజనీరింగ్ కళాశాల్లో అయితే కన్వీనర్ కోటాలో ఒక్క విద్యార్థీ చేరలేదు. 21 కాలేజీల్లో చేరిన విద్యార్ధుల సంఖ్య 5 లోపే. పది మంది లోపు విద్యార్ధులు చేరిన కళాశాలలకు 42. ఇక 56 కాలేజీల్లో అయితే 15 మంది లోపు చేరారు. 79 కాలేజీల్లో 25 మంది లోపే విద్యార్ధులు చేరగా , 110 కాలేజీల్లో 50 మంది లోపు చేరారు. 160 కళాశాలల్లో వంద మందిలోపు విద్యార్ధులు చేరినట్లు సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. 91 కాలేజీల్లో మాత్రమే కన్వీనర్ కోటాలో వంద శాతం సీట్లు భర్తీ అయిందని తెలిపింది. ప్రస్తుతం కళాశాలలు స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాయి. మరి ఈ ప్రక్రియలో ఎంత మంది విద్యార్ధులు కళాశాల్లో చేరతారో తెలియదు. దీంతో 50 మంది లోపు విద్యార్ధులు చేరిన 110 కళాశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
Next Story