Telugu Global
Others

హోదా కంటే రెట్టింపు నిధులు: బీజేపీ ఎంపీ

ఏపీకి ప్రత్యేకహోదా వల్ల వచ్చే నిధుల కంటే, రెట్టింపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోందని విశాఖ ఎంపీ, బీజేపీ నేత కంభంపాటి హరిబాబు చెప్పారు. రాజధానికి ప్రణాళిక సిద్ధం కాకపోయినా, ఇప్పటికే కేంద్రం వెయ్యి కోట్లు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. పోలవరంపై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు, పదేళ్లు అధికారంలో ఉండి ఏంచేశారో చెప్పాలని హరిబాబు డిమాండ్ చేశారు. విభజన చట్టంలో లేని అంశాలను కూడా కేంద్రం అమలు చేస్తోందని ఆయన […]

ఏపీకి ప్రత్యేకహోదా వల్ల వచ్చే నిధుల కంటే, రెట్టింపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోందని విశాఖ ఎంపీ, బీజేపీ నేత కంభంపాటి హరిబాబు చెప్పారు. రాజధానికి ప్రణాళిక సిద్ధం కాకపోయినా, ఇప్పటికే కేంద్రం వెయ్యి కోట్లు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. పోలవరంపై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు, పదేళ్లు అధికారంలో ఉండి ఏంచేశారో చెప్పాలని హరిబాబు డిమాండ్ చేశారు. విభజన చట్టంలో లేని అంశాలను కూడా కేంద్రం అమలు చేస్తోందని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని హరిబాబు చెప్పారు. ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురి చేయడం సరికాదన్నారు.
First Published:  10 Aug 2015 6:50 PM IST
Next Story