Telugu Global
NEWS

హోదా కోసం పోరు ప్రతిపక్షంగా మాబాధ్యత: విజయసాయిరెడ్డి

ప్రత్యేక హోదాపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతిపక్షంగా ప్రజల మేలు కోరి జనాన్ని సమీకరించి పోరాటం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి అన్నారు. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద జగన్‌ దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిన పక్షాలన్నీ తమ పార్టీకి అండగా నిలబడాల్సి ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నట్టు చెబుతూనే భిన్న వైఖరి అవలంభిస్తుందని, ఇక కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో […]

హోదా కోసం పోరు ప్రతిపక్షంగా మాబాధ్యత: విజయసాయిరెడ్డి
X
ప్రత్యేక హోదాపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతిపక్షంగా ప్రజల మేలు కోరి జనాన్ని సమీకరించి పోరాటం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి అన్నారు. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద జగన్‌ దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిన పక్షాలన్నీ తమ పార్టీకి అండగా నిలబడాల్సి ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నట్టు చెబుతూనే భిన్న వైఖరి అవలంభిస్తుందని, ఇక కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీలు ప్రజలతో దొంగాటలాడుతున్నాయని ఆయన ఆరోపించారు. నాడు ప్రత్యేక హోదా కోసం పట్టుబడినవారే అధికారంలో ఉన్నా ఆ విషయాన్ని పక్కనపెట్టడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం నిజంగా పని చేస్తున్నట్టయితే వెంటనే తమ మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకుని ప్రత్యేక హోదా కోసం బీజేపీని నిలదీయాలని విజయసాయిరెడ్డి డిమాండు చేశారు.
First Published:  10 Aug 2015 5:12 AM IST
Next Story