ఆ పార్టీలు విష సర్పాలు .. నమ్మొద్దు " ప్రధాని
బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆదివారం గయాలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన జేడీయూ, ఆర్జేడీల పొత్తుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీలు విష సర్పాలని స్వప్రయోజనాల కోసమే పొత్తు కుదుర్చుకున్నాయని, ప్రజలు వాటిని నమ్మొద్దని ఆయన కోరారు. బీహార్ తలరాతను మార్చగల సత్తా బీజేపీకే ఉందని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ సభలో ఆయన లలిత్ గేట్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న […]
BY sarvi10 Aug 2015 1:44 AM GMT
X
sarvi Updated On: 10 Aug 2015 1:44 AM GMT
బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆదివారం గయాలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన జేడీయూ, ఆర్జేడీల పొత్తుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీలు విష సర్పాలని స్వప్రయోజనాల కోసమే పొత్తు కుదుర్చుకున్నాయని, ప్రజలు వాటిని నమ్మొద్దని ఆయన కోరారు. బీహార్ తలరాతను మార్చగల సత్తా బీజేపీకే ఉందని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ సభలో ఆయన లలిత్ గేట్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ముఖ్యమంత్రిని సమర్థించారు. ఆమె రాజస్థాన్‌ను ఉన్నత స్థానంలోకి తీసుకు వెళ్లారని ఆయన అన్నారు.
Next Story