జోగులాంబ ఆలయంలో వరుణ యాగం
తెలంగాణలో వర్షాలు కురవాలని కోరుతూ ఆలంపూర్ పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఇవాళ భక్తి శ్రద్ధలతో వరుణ యాగం నిర్వహించారు. ఈ యాగంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. తర్వాత పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వర్షాలు కురిసి బంగారు పంటలు పండాలంటే రాష్ట్రంలోని ఆలయాల్లో తప్పనిసరిగా వరుణయాగం చేయాలని సూచించారు.