ఎన్డీసీ తలుచుకుంటే తక్షణమే ప్రత్యేక హోదా: జగన్
జాతీయ అభివృద్ధి మండలి(ఎన్‌డీసీ) తలచుకుంటే వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వవచ్చని, ఎన్‌డీసీకి ఛైర్మన్‌గా ఉండే ప్రధానమంత్రికే ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఉంటుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. ఆ విషయం కూడా తెలియకుండా ఈ ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే హాసాస్పదంగా ఉందని జగన్ దుయ్యబట్టారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నందున దీనిపై ఆలోచించాల్సి వస్తోందని బీజేపీ ప్రభుత్వం చెబుతోందని, అసలు ఫైనాన్స్ […]
BY sarvi10 Aug 2015 5:05 AM GMT
X
sarvi Updated On: 10 Aug 2015 5:17 AM GMT
జాతీయ అభివృద్ధి మండలి(ఎన్‌డీసీ) తలచుకుంటే వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వవచ్చని, ఎన్‌డీసీకి ఛైర్మన్‌గా ఉండే ప్రధానమంత్రికే ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఉంటుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. ఆ విషయం కూడా తెలియకుండా ఈ ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే హాసాస్పదంగా ఉందని జగన్ దుయ్యబట్టారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నందున దీనిపై ఆలోచించాల్సి వస్తోందని బీజేపీ ప్రభుత్వం చెబుతోందని, అసలు ఫైనాన్స్ కమిషన్‌కు ప్రత్యేక హోదా గురించి రికమెండ్ చేసే అధికారం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఫైనాన్స్ కమిషన్‌కు ప్రత్యేక హోదాపై సిఫార్సు చేసే అధికారం ఎక్కడ నుంచి వచ్చిందని, ఈ విషయం బీజేపీ వాళ్ళకిగాని, టీడీపీ ఎంపీలకు గాని తెలుసా అని నిలదీశారు. ఏ రాష్టానికి ఎంత కేటాయింపులు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలనే విషయాలు తప్ప… బడ్జెట్‌లో లోటు గురించి, బడ్జెట్ ఆదాయ వ్యయాల గురించి ఫైనాన్స్ కమిషన్‌కు సంబంధమే లేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఎవరికైనా ఉందంటే అద ఒక్క ప్రధానమంత్రికేనని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజ్యసభలో ప్రత్యేక హోదా అనే పదాలతో ప్రధానమంత్రి మాటిచ్చారని, రాష్ట్రం విడిపోవడం చాలా దురదృష్టకరమని, సీమాంధ్ర నష్టపోతున్న విషయం తనకు కూడా తెలుసునని ప్రధాని స్వయంగా అన్నారని, దీన్ని భర్తీ చేసేందుకు ప్రత్యేక హోదా వంటి అనేక రాయితీలతో ప్రయోజనం కల్పిస్తామని భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. సీమాంధ్ర నష్టపోకుండా అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి వచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా మారిపోతుందని, 10 శాతం మాత్రమే తిరిగి చెల్లించాల్సి ఉంటుందని జగన్ వివరించారు. ఇది రాకుండా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ పరోక్షంగా సహకరిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు దీనికి వంత పాడుతున్నారని అన్నారు. ఇలా ఎన్నో రాయితీలు రావడంతోపాటు పన్నుల్లో ప్రోత్సాహకాలు ఉంటాయని, దీనివల్ల పరిశ్రమలు విరివిగా వచ్చే అవకాశం ఉందని, రాష్ట్రం బాగుపడుతుందని, నిరుద్యోగం తొలగుతుందని అన్నారు.
Next Story