Telugu Global
NEWS

రిజిష్ట‌ర్డ్ రాజ‌కీయ పార్టీల సంఖ్య 1866 

తెలుగు  రాష్ట్రాల్లో  ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల పేర్లు చెప్ప‌మంటే  టీఆర్ఎస్‌, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌, బీజేపీ అంటూ ట‌క‌ట‌కా చెప్పేస్తాం. అయితే, దేశ‌వ్యాప్తంగా ఉన్న పార్టీల వివ‌రాల చెప్ప‌మంటే మాత్రం నీళ్లు న‌ములుతాం. మీరే కాదు కొమ్ములు తిరిగిన రాజ‌కీయ పండితులు కూడా మ‌న‌దేశంలో రిజిష్ట‌ర్డ్ అయిన రాజ‌కీయ పార్టీల పేర్ల‌ను అన‌ర్గ‌ళంగా చెప్ప‌లేరు. ఎందుకంటే మ‌న‌దేశంలో 1866 రిజిష్ట‌ర్డ్ రాజ‌కీయ పార్టీలున్నాయి. అయితే వాటిలో కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీలు మాత్ర‌మే  జాతీయ […]

రిజిష్ట‌ర్డ్ రాజ‌కీయ పార్టీల సంఖ్య 1866 
X
తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల పేర్లు చెప్ప‌మంటే టీఆర్ఎస్‌, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌, బీజేపీ అంటూ ట‌క‌ట‌కా చెప్పేస్తాం. అయితే, దేశ‌వ్యాప్తంగా ఉన్న పార్టీల వివ‌రాల చెప్ప‌మంటే మాత్రం నీళ్లు న‌ములుతాం. మీరే కాదు కొమ్ములు తిరిగిన రాజ‌కీయ పండితులు కూడా మ‌న‌దేశంలో రిజిష్ట‌ర్డ్ అయిన రాజ‌కీయ పార్టీల పేర్ల‌ను అన‌ర్గ‌ళంగా చెప్ప‌లేరు. ఎందుకంటే మ‌న‌దేశంలో 1866 రిజిష్ట‌ర్డ్ రాజ‌కీయ పార్టీలున్నాయి. అయితే వాటిలో కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీలు మాత్ర‌మే జాతీయ పార్టీలు. ఇవి కాకుండా 50 పార్టీలు రాష్ట్రస్థాయి పార్టీలుగా గుర్తింపు పొందాయి. రాజ‌కీయ పార్టీలు మొత్తం పోలైన ఓట్ల‌లో 4 శాతం సాధించాలి. పార్టీ కార్య‌క‌లాపాల‌ను కూడా ఎన్నిక‌ల సంఘానికి నివేదించాలి. లేనిప‌క్షంలో ఎన్నిక‌ల సంఘం ఆ పార్టీ గుర్తింపు ర‌ద్దు చేస్తుంది. అలాంటి పార్టీలు గుర్తింపులేని రిజిష్ట‌ర్డ్ పార్టీలుగా కొన‌సాగుతాయి. అలాంటి పార్టీలు మ‌న‌దేశంలో 1812 ఉన్నాయి. అభ్య‌ర్ధులు పోలైన ఓట్లలో 6శాతం ఓట్ల‌ను సాధించ‌లేక పోతే ఆ అభ్య‌ర్ధి డిపాజిట్ జ‌ప్తు చేస్తారు. గుర్తింపు లేని రాజ‌కీయ పార్టీల అభ్య‌ర్ధుల కోసం ఎన్నిక‌ల సంఘం 84 ఎన్నిక‌ల గుర్తుల‌ను కేటాయించింది. స్వ‌తంత్ర అభ్య‌ర్ధులు కూడా ఈ గుర్తుల‌పైనే పోటీ చేస్తారు. అయితే, ప‌ది సంవ‌త్స‌రాల కాలంలో అసెంబ్లీకి, లోక్‌సభ‌కు పోటీ చేయ‌ని రాజ‌కీయ పార్టీల రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు చేయాల‌ని లా క‌మిష‌న్ చేస్తున్న ప్ర‌తిపాద‌న‌ను కొన్ని రాజ‌కీయ పార్టీలు వ్య‌తిరేకిస్తున్నాయి.
First Published:  10 Aug 2015 7:25 AM IST
Next Story