కరాచీ గీత ఖమ్మం బిడ్డ
కరాచీ గీత కోసం మరో జంట వార్తల్లోకెక్కింది. పాకిస్థాన్ లోని కరాచీలో ఉన్న మూగ, చెవిటి యువతి గీత తమ బిడ్డేనని ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల పడమట నర్సాపురం గ్రామానికి చెందిన జజ్జెర కృష్ణయ్య, గోపమ్మ దంపతులు చెబుతున్నారు. నలుగురు ఆడపిల్లలతో గీత నాలగవదని, ఆమె అసలు పేరు రాణి అని వారు చెబుతున్నారు. గీత పుట్టుక తోనే మూగ చెవుడు ఉన్నాయి. గీతకు బాగవ్వాలని 2006లో గుంటూరులో జరిగిన ఏసుక్రీస్తు మహాసభలకు వెళ్లినప్పుడు తప్పి […]
BY sarvi9 Aug 2015 6:40 PM IST

X
sarvi Updated On: 10 Aug 2015 6:58 AM IST
కరాచీ గీత కోసం మరో జంట వార్తల్లోకెక్కింది. పాకిస్థాన్ లోని కరాచీలో ఉన్న మూగ, చెవిటి యువతి గీత తమ బిడ్డేనని ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల పడమట నర్సాపురం గ్రామానికి చెందిన జజ్జెర కృష్ణయ్య, గోపమ్మ దంపతులు చెబుతున్నారు. నలుగురు ఆడపిల్లలతో గీత నాలగవదని, ఆమె అసలు పేరు రాణి అని వారు చెబుతున్నారు. గీత పుట్టుక తోనే మూగ చెవుడు ఉన్నాయి. గీతకు బాగవ్వాలని 2006లో గుంటూరులో జరిగిన ఏసుక్రీస్తు మహాసభలకు వెళ్లినప్పుడు తప్పి పోయిందని వారంటున్నారు. పత్రికలు, టీవీల్లో వస్తున్న వార్తల ఆధారంగా తమ కూతురును గుర్తించామని, డీఎన్ఏ పరీక్షలకు కూడా తాము సిద్ధమేనని వారు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు దంపతులు గీత మా బిడ్డంటే మా బిడ్డని చెబుతున్నారు. అసలు గీత ఎవరి బిడ్డ అన్న విషయం అధికారుల పూర్తిస్థాయి విచారణలో తేలనున్నది.
Next Story