బాబూరావు డిస్మిస్, వీసీ మార్పు: గంటా
నాగార్జున యూనివర్శిటీ విద్యార్థి రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనలో సుబ్రమణ్యం కమిటీ ఇచ్చిన సూచనల ఆధారంగా ప్రిన్సిపాల్ బాబు రావును డిస్మిస్ చేస్తున్నామని, నాగార్జున వర్సిటీ ఇంచార్జ్ వీసీ సాంబశివరావు స్థానంలో ఐఏఎస్ అధికారిణి ఉదయలక్ష్మిని నియమించామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బాబురావును విచారించాలని.. క్యాంపస్‌లో నిఘా పెంచాలని… అన్ని వర్సిటీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, అవసరమైతే పోలీసు ఔట్ పోస్టులను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. క్యాంపస్‌లో మద్యపానాన్ని బాబురావు ప్రోత్సహించడంతో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి […]
BY sarvi9 Aug 2015 6:38 PM IST
X
sarvi Updated On: 10 Aug 2015 5:18 AM IST
నాగార్జున యూనివర్శిటీ విద్యార్థి రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనలో సుబ్రమణ్యం కమిటీ ఇచ్చిన సూచనల ఆధారంగా ప్రిన్సిపాల్ బాబు రావును డిస్మిస్ చేస్తున్నామని, నాగార్జున వర్సిటీ ఇంచార్జ్ వీసీ సాంబశివరావు స్థానంలో ఐఏఎస్ అధికారిణి ఉదయలక్ష్మిని నియమించామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బాబురావును విచారించాలని.. క్యాంపస్‌లో నిఘా పెంచాలని… అన్ని వర్సిటీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, అవసరమైతే పోలీసు ఔట్ పోస్టులను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. క్యాంపస్‌లో మద్యపానాన్ని బాబురావు ప్రోత్సహించడంతో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి మందుకొట్టేవారని నివేదిక వెల్లడించిందని గంటా తెలిపారు. రిషితేశ్వరి మృతికి బాబురావు కూడా కారణమేనని నివేదిక తెలిపిందన్నారు. ఆయనపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించింది. ప్రిన్సిపాల్ అండతోనే సీనియర్లు చెలరేగి రిషితేశ్వరి మానసికంగా, లైంగికంగా వేధించారని తేల్చింది. రిషితేశ్వరి కేసు విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సూచించింది. కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తామని గంటా స్పష్టం చేశారు.
Next Story