పాలిచ్చే తల్లులు పెరిగారు: యూనిసెఫ్
భారతదేశంలో 2006 నుంచి 2013 కాలంలో ఉద్యోగం చేస్తున్న మహిళలు పిల్లలకు పాలివ్వడం పెరిగిందని, ఇది స్థిరంగా ఉండాలని యూనిసెఫ్ అభిప్రాయ పడింది. భారత్‌లో పని చేసే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వంటి పలు సమస్యలున్నాయని, ప్రభుత్వం వాటిని పరిష్కరించాలని యూనిసెప్ పోషకాహార నిపుణురాలు గాయత్రీ సింగ్ చెప్పారు. ప్రసూతి సెలవు, పిల్లలకు పాలిచ్చేందుకు విరామం వంటి సదుపాయాలను అసంఘటిత రంగంలో కూడా కల్పిస్తూ జాతీయ చట్టాలను రూపొందించాలని ఆమె కోరారు. […]
BY sarvi10 Aug 2015 3:21 AM GMT
X
sarvi Updated On: 10 Aug 2015 4:27 AM GMT
భారతదేశంలో 2006 నుంచి 2013 కాలంలో ఉద్యోగం చేస్తున్న మహిళలు పిల్లలకు పాలివ్వడం పెరిగిందని, ఇది స్థిరంగా ఉండాలని యూనిసెఫ్ అభిప్రాయ పడింది. భారత్‌లో పని చేసే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వంటి పలు సమస్యలున్నాయని, ప్రభుత్వం వాటిని పరిష్కరించాలని యూనిసెప్ పోషకాహార నిపుణురాలు గాయత్రీ సింగ్ చెప్పారు. ప్రసూతి సెలవు, పిల్లలకు పాలిచ్చేందుకు విరామం వంటి సదుపాయాలను అసంఘటిత రంగంలో కూడా కల్పిస్తూ జాతీయ చట్టాలను రూపొందించాలని ఆమె కోరారు. ప్రతి ఏటా ఆగస్టు మొదటి వారాన్ని ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది * పిల్లలకు పాలిస్తూ పని చేద్దాం – అలా చేయడం సాధ్యమేనని నిరూపిద్దాం * అనే అంశం ఆధారంగా తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రీ సింగ్ భారతీయ తల్లుల్లో పాలిచ్చే రేటు గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.
Next Story