ఆప్ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి
ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యే అల్కా లాంబాపై గుర్తు తెలియని దుండుగుడు రాళ్లతో దాడి చేయడంతో ఆమె తలకు గాయమైంది. ఈ సంఘటన ఆదివారం ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద జరిగింది. ఆల్కాసింగ్ ఉదయం ఆరు గంటలకు స్థానికులతో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రసంగిస్తుండగా ఆమెపై దాడి జరిగింది. గాయపడిన ఆప్ ఎమ్మెల్యేను చికిత్స స్థానిక అరుణా అసఫ్ అలీ హాస్పటల్‌కు తరలించారు. ఎమ్మెల్యేపై దుండుగుడు ఓ స్వీటు షాపు నుంచి దాడి […]
BY sarvi9 Aug 2015 1:12 PM
X
sarvi Updated On: 10 Aug 2015 1:49 AM
ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యే అల్కా లాంబాపై గుర్తు తెలియని దుండుగుడు రాళ్లతో దాడి చేయడంతో ఆమె తలకు గాయమైంది. ఈ సంఘటన ఆదివారం ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద జరిగింది. ఆల్కాసింగ్ ఉదయం ఆరు గంటలకు స్థానికులతో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రసంగిస్తుండగా ఆమెపై దాడి జరిగింది. గాయపడిన ఆప్ ఎమ్మెల్యేను చికిత్స స్థానిక అరుణా అసఫ్ అలీ హాస్పటల్‌కు తరలించారు. ఎమ్మెల్యేపై దుండుగుడు ఓ స్వీటు షాపు నుంచి దాడి చేసాడని, ఆ స్వీటు షాపు యజమాని ఢిల్లీలోని విశ్వాస్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్‌శర్మగా గుర్తించామని ఆప్ సీనియర్ నేత అశుతోష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి జతిన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు. అయితే, మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా తన ప్రచారాన్ని ఆపబోనని ఎమ్మెల్యే ఆల్కా స్పష్టం చేశారు. ఆల్కాను చూసి గర్వ పడుతున్నానని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
Next Story